-
-
Home » Andhra Pradesh » Kadapa » vidyuth samasyalu parishkarinchali-MRGS-AndhraPradesh
-
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-15T05:04:22+05:30 IST
వ్యవసాయ కనెక్షన్లు, చెత్త సంపద కేంద్రాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదని కె.బుడుగుంటపల్లె సర్పంచ్ చంద్ర శేఖర్ మండల సర్వసభ్య సమావేశంలో ధ్వజ మెత్తారు.
రైల్వేకోడూరు, మే 14: వ్యవసాయ కనెక్షన్లు, చెత్త సంపద కేంద్రాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదని కె.బుడుగుంటపల్లె సర్పంచ్ చంద్ర శేఖర్ మండల సర్వసభ్య సమావేశంలో ధ్వజ మెత్తారు. శనివారం రైల్వేకోడూరు మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో ఎంపీపీ భవాని, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కె. బుడుగుంటపల్లె సర్పంచ్ చంద్రశేఖర్ విద్యుత్ సమస్యను లేవనెత్తారు. చెత్త సంపద కేంద్రాలకు విద్యుత్ రావడం లేదని, దళిత, గిరిజన గ్రామాల్లో ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలను తొలగించి, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగార్జునరావు, వ్యవసాయ అధికారి సుధాకర్, మండల హౌసింగ్ శాఖ అధికారి మురళీకృష్ణ, వైస్ ఎంపీపీ మందల మంజుల, రైల్వేకోడూరు ఉప సర్పంచ్ తోట శివసాయి, ఎంపీటీసీ సభ్యులు బండారు మల్లికార్జున, జనార్దన్‌రాజు, సర్పంచ్‌లు నాయని హరికృష్ణారెడ్డి, మావిళ్ల సుబ్బయ్య, యామల రాజ పాల్గొన్నారు.
విద్యా దీవెన ఓ వరం
ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన విద్యారు ్థలకు వరంలాంటిదని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీడీవో కార్యాలయ సభాభవనంలో జగనన్న విద్యాదీవెన కా ర్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో 5,980 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 4,10,32, 999 కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగార్జునరావు, జిల్లా వైసీపీ నాయకులు పంజం సుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

