ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అసాంఘిక శక్తులు జిల్లా దాటాల్సిందే...

ABN, First Publish Date - 2022-05-14T06:08:35+05:30

ఎర్రచందనం స్మగ్లింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, రౌడీషీటర్లు వంటి అసాంఘిక శక్తులు జిల్లా సరిహద్దులు దాటి పోవాల్సిందేనని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు. సమాజంలో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టే వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుస్టేషన్‌కు వెళ్తే.. న్యాయం జరుగతుందని ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగించడమే తమముందున్న ప్రథమ కర్తవ్యమని అన్నారు. ‘‘నాపై ఎంతో నమ్మకంతో కొత్త జిల్లాకు ఎస్పీగా పనిచేసే అవకాశం కల్పించారు. ఇది నాకు దక్కిన గౌరవం.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవు 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికడతాం 

క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌పై ఉక్కుపాదమే 

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఎర్రచందనం స్మగ్లింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, రౌడీషీటర్లు వంటి అసాంఘిక శక్తులు జిల్లా సరిహద్దులు దాటి పోవాల్సిందేనని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు హెచ్చరించారు. సమాజంలో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టే వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుస్టేషన్‌కు వెళ్తే.. న్యాయం జరుగతుందని ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగించడమే తమముందున్న ప్రథమ కర్తవ్యమని అన్నారు. ‘‘నాపై ఎంతో నమ్మకంతో కొత్త జిల్లాకు ఎస్పీగా పనిచేసే అవకాశం కల్పించారు. ఇది నాకు దక్కిన గౌరవం. ఒక్కసారిగా పూర్తి స్థాయిలో నేరాలు లేకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే ప్రజలకు శాంతిభద్రతలు అందించడంలో నాకంటూ కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి.. వాటిని సక్రమంగా అమలు చేయడానికి నాతో పాటు.. సిబ్బందిని మమేకం చేయిస్తున్నాను. సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి నేను వందకు వందశాతం కృషి చేస్తా’’అని ఆంధ్రజ్యోతితో ఆయన శుక్రవారం ముచ్చటించారు. ఇంకా ఆయన ఏమన్నారో.. ? ఆయన మాటల్లోనే.. 

- రాయచోటి


? జిల్లాలో పోలీసుల గౌరవం పెంచేందుకు మీరు ఎంచుకున్న ప్రఽథమ కర్తవ్యం. 

! తమకు ఎవరి వల్లనైనా ఎంతటి ఇబ్బంది కలిగినా.. పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే నా ముందున్న ప్రథమ కర్తవ్యం. జిల్లాలో ఎక్కువగా కుటుంబ వివాదాలు, భూవివాదాలు, తప్పిపోయిన కేసులు, ప్రేమ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆ కేసుల పరిష్కారం సమస్య కాదు. అయితే స్టేషన్‌ గడప తొక్కే ఫిర్యాదుదారునికి నమ్మకం కలిగించడం కోసం... ఫిర్యాదు చేయడానికి వచ్చిన అతనితో మంచిగా మాట్లాడడం, వాళ్ల సమస్యను సావధానంగా వినడం.. ఫిర్యాదులో ఉన్న వాస్తవాన్ని బట్టి తక్షణమే స్పందించి.. ఒకటి రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేయడం వంటివి చేస్తున్నాం. గత నెల రోజుల్లో పోక్సో, దౌర్జన్యంగా ఇతరుల భూముల్లోకి ప్రవేశించడం, మహిళలను వేధించడం.. హింసించడం వంటి కేసుల్లో తక్షణం కేసులు నమోదు చేసి ఆ రోజే.. లేదా మరుసటి రోజు నిందితులను అరెస్టు చేశాం. ఏదైనా నేరం జరిగినపుడు పోలీసులు స్పందించే దాన్ని బట్టే... ప్రజల్లో పోలీసులపై నమ్మకం ఏర్పడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తాను. 


? పోలీసుల పనితీరు మెరుగుపడేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు. 

! ప్రజలకు పోలీసులు ఉన్నారనే ధైర్యం కలిగించేందుకు నెల రోజులుగా అనేక చర్యలు చేపట్టాం. ప్రతి రోజూ రాత్రివేళల్లో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నాం. జిల్లాలో ఉన్న మూడు సబ్‌ డివిజన్లలో ప్రతి రోజూ రెండు సబ్‌ డివిజన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. సాయంత్రం, ఉదయం ఎస్‌ఐలు తమ సిబ్బందితో గ్రామాలలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరిస్తున్నారు. పలు సమస్యలపై 




ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో కనీసం 20 నుంచి 25 గ్రామాలలో పోలీసులు పర్యటిస్తున్నారు. పోలీసులు ప్రతి రోజూ ఏఏ గ్రామాలలో పర్యటిస్తున్నారు.. ఏం చేస్తున్నారు.. వంటి వివరాలు స్వయంగా నేనే సేకరించి.. ప్రతి నెలా సమీక్ష చేస్తున్నా. సంతృప్తికరంగా విధులు నిర్వహించలేకపోయిన వాళ్ల నుంచి సంజాయిషీ తీసుకుని.. అవసరం అయితే మెమోలు జారీ చేస్తున్నా. పనితీరు మెరుగుపర్చుకోవాలని వార్నింగ్‌ ఇస్తున్నా.


? పాత నేరస్థుల కదలికలపై ఎటువంటి నిఘా ఉంది

! పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాం. గత నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నాటుసారా అమ్మకందార్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్లు, జూదగాళ్లు, రౌడీషీటర్లు వంటి వాళ్లను 950 మందిని బైండోవర్‌ చేశాం. వీళ్లందరి వద్ద నుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకు జామీను తీసుకున్నాం. బైండోవర్‌ అయి.. ఏదైనా నేరం చేస్తే జామీను మొత్తం వసూలు చేస్తాం. దీంతో పాటు కఠిన చర్యలు కూడా తప్పవు. 


? స్పందన కార్యక్రమానికి ప్రజల స్పందన ఎలా ఉంది

! స్పందన పిటీషన్లపై తక్షణమే స్పందిస్తున్నాం.. వీలైనంత త్వరగా చట్టపరంగా న్యాయం చేస్తున్నాం. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు మా కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి.. ఫిర్యాదుపై పరిష్కారం అయిందా ? లేదా ? అని వాకబు చేస్తున్నాం. ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూముల వివాదాల కేసుల్లో మాత్రమే సంతృప్తి లేదు అంటున్నారు. భూముల కేసుల్లో కొన్నిటికి కోర్టు వ్యవహారాలు ఉంటాయి.. అందుకే పోలీసులు తక్షణమే న్యాయం చేయలేకపోవచ్చు. మోసం చేయడం, వేధింపులు వంటి కేసుల్లో స్పందనపై ప్రజల్లో మంచి సంతృప్తి ఉంది.


? రౌడీషీటర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు.

! జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలోనూ రౌడీషీటర్లను పిలిపించి బైండోవర్‌ చేశాం.

వాళ్లందరినీ ప్రతి మంగళవారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. తరుచూ నేరాలకు పాల్పడే రౌడీషీటర్లపై పీడీయాక్టు అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. దీంతో వాళ్లు కనీసం ఒక సంవత్సరం అయినా జైలులో ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక శక్తులు, పల్లెల్లో సమస్యలు సృష్టించే వాళ్లు, నిత్యం గొడవలు, కొట్లాటలకు పాల్పడే వాళ్ల సమాచారం సేకరిస్తున్నాం. ఎవరైనా ఒకరి వల్ల పల్లెల్లో అందరికీ సమస్యగా ఉంటుంది అని గుర్తిస్తే.. వాళ్లను నగర బహిష్కరణ చేస్తాం. సమస్య మరీ ఎక్కువగా ఉంటే పీడీయాక్టు పెట్టేందుకు సిద్ధం చేస్తున్నాం.


? క్రికెట్‌ బెట్టింగ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు.

! వాస్తవానికి మా దగ్గర ఇంకా క్రికెట్‌ బెట్టింగ్‌ గురించి పూర్తి స్థాయిలో సమాచారం లేదు. అందుకే బెట్టింగ్‌కు పాల్పడుతున్న వాళ్లను ప్రస్తుతం అరెస్టు చేయలేకపోయాం. అయితే గతంలో పోలీసు రికార్డుల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న వాళ్లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. బెట్టింగ్‌ వల్ల పీలేరు, గుర్రంకొండ, వాల్మీకిపురంలలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మాకు సమాచారం లేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. బాఽధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం.

 

? వైట్‌ కాలర్‌ నేరాలు జిల్లాలో ఎలా ఉన్నాయి.

! మన జిల్లాలో పెద్దగా వైట్‌ కాలర్‌ కేసులు లేవు. ఇటీవల దొంగ బంగారం, వజ్రాల పేరుతో మోసం చేసిన కేసులో నిందితులను కదిరి నుంచి తీసుకొచ్చి అరెస్టు చేశాం. వీరిపై చాలా కేసులు ఉన్నాయి. ఇటువంటి మోసం చేసిన వ్యవహారం మా దృష్టికి రాగానే కేసు రిజిస్టర్‌ చేసి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.

 

? మట్కా, గ్యాంబ్లింగ్‌ నేరాలు అరికట్టడానికి..

! మట్కా, గ్యాంబ్లింగ్‌పై గత నెలలో అనేక కేసులు నమోదు చేశాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 కేసులు గ్యాంబ్లింగ్‌పైన నమోదు చేశాం. 


? ఇసుక అక్రమ రవాణాపై..

! ఎక్సకవేటర్‌, ఇటాచీ వంటి యంత్రాలు పెట్టి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం వచ్చిన ప్రతి చోటా స్పందించాం. ట్రాక్టర్లను సీజ్‌ చేశాం. ప్రతి రోజూ కనీసం ఒకటి రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాలో పదేపదే దొరికిన వాళ్లను కూడా బైండోవర్‌ చేశాం. వాళ్ల మీద కూడా నగర బహిష్కరణ వంటి చర్యలు తప్పవు. 


? ఎర్రచందనం అక్రమ రవాణాపై..

! గత నెలలో మూడు కేసులు నమోదు చేసి 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నాం. సుమారు 50 దుంగలు స్వాధీనం చేసుకున్నాం. ఇటీవల పుల్లంపేట ప్రాంతానికి చెందిన ప్రసాద్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేశాం. ఇంకో ఇద్దరు స్మగ్లర్ల వివరాలు సేకరిస్తున్నాం. వీళ్లందరిపైనా ఈ నెలాఖరులోగా పీడీయాక్టు అమలు చేయబోతున్నాం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టడం కోసమే రాత్రిపూట ఆకస్మిక వాహనాల తనిఖీ చేస్తున్నాం. రాజంపేట, మదనపల్లె, కేవీపల్లె, పీలేరు రాయచోటి, పుల్లంపేట, ఓబులవారిపల్లె, సుండుపల్లె, వీరబల్లి, చిట్వేలి, నందలూరు, చీకలబైలు చెక్‌పోస్టుల్లో ప్రతి రోజూ రాత్రిపూట వాహనాలు తనిఖీ చేస్తున్నాం. 


? జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయా

! జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవు. గురువారం రాత్రి మదనపల్లెలో ఎన్‌ఐఏ వాళ్లు   అరెస్టు చేసిన ఆంజనేయులు మాజీ నక్సలైట్‌. అతను ఎప్పుడో ప్రభుత్వానికి లొంగిపోయాడు. కేరళలో ఏదో కేసులో అతన్ని అరెస్టు చేశారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!