ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పీఠాధిపతుల ఆధ్వర్యంలో వైభవంగా.... కుంభాభిషేక మహోత్సవం

ABN, First Publish Date - 2022-05-15T05:00:06+05:30

శ్రీలక్ష్మీ నరసింహస్వామి కుంభాభిషేక మహోత్సవం శనివారం వైభ వంగా జరిగింది.

కుంభాభిషేకంలో పాల్గొన్న పీఠాధిపతులు, వేదపండితులు, పుత్తా నరసింహారెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వల్లూరు, మే 14: శ్రీలక్ష్మీ నరసింహస్వామి కుంభాభిషేక మహోత్సవం శనివారం వైభ వంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోత్సరణల నడుమ పీఠాధిపతు లు కుంభాభిషేక ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని హంపీక్షేత్ర గోవిందానంద సరస్వతి పీఠాధిపతి సహా భీమవరం మహాసంస్థానం పీఠాధిపతి త్రిదండి రామానుజా జియర్‌ స్వామి, త్రిదండి దేవనాదన్‌ రామానుజా జియర్‌ ఆధ్వర్యంలో వేదపండితులు రాజేష్‌ భట్టర్‌ నిర్వహించా రు. 

ప్రహల్లాదునికి అభయమిచ్చినట్లే నరసింహస్వామి భక్తులపాలిటి కల్ప వృక్షంగా, తోడు, నీడై కాపాడతారని పీఠాధిపతులు తెలిపా రు. కార్యక్రమంలో పుత్తా నరసింహారెడ్డి కుటుంబీకులు రామచంద్రారెడ్డి, చైతన్యరెడ్డి దంపతులు, లక్ష్మీరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం వాలీబాల్‌ పోటీలను యువనేత చైతన్యరెడ్డి, లక్ష్మీ రెడ్డి, సాయినరసింహారెడ్డి ప్రారంభించారు. 

 బండలాగుడు విజేతలు వీరే

బండలాగుడు పోటీల్లో మొదటి బహుమతి రూ.40 వేలను గుంటూరు జిల్లా బాపట్ల మండ లం ఉప్పలూరు వాసి రవిశంకర్‌రెడ్డి ఎడ్ల జత, అదే జిల్లాకు చెందిన శ్రీసజ్ఞరెడ్డి ఎద్దులు గెలుచుకోగా, రెండో బహుమతి రూ.30 వేలను కమలాపురం మండలం జంగంపల్లెకి  చెందిన నాగసుబ్బారెడ్డి ఎద్దులు కైవ శం చేసుకున్నాయి. మూడో బహుమతి రూ.20 వేలను దువ్వూరు మండలం గల్లపల్లి గ్రామానికి చెందిన రామ్‌చర ణ్‌, ప్రొద్దుటూరుకు చెందిన రిల్లా బ్రద ర్స్‌ గెలుచుకోగా, నాలుగో బహుమతి రూ.10 వేలను గుంటూరుకు చెందిన రవిశంకర్‌, ప్రొద్దుటూరుకు చెందిన శివకృష్ణయాదవ్‌ గెలుచుకోగా, 5వ బహుమతి రూ.5 వేలను రామ్‌చరణ్‌ ఎద్దులు గెలుచుకున్నాయి.

నేడు లక్ష్మీ నృసింహ కల్యాణోత్సవం

 ఆదివారం లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిరహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. అనంతరం అన్నప్రసాదం  ఉం టుందని భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!