ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మోటార్లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2022-05-15T04:58:00+05:30

వ్యవసాయ మోటా ర్లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని, రాష్ట్రంలో రైతులకు డ్రిప్‌ పరికరాల ఎప్పుడిస్తారో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

వేంపల్లెలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

డ్రిప్‌ పరికరాలు ఎప్పుడిస్తారో ప్రకటించండి

బాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపిచ్చిన ఎమ్మెల్సీ 

వేంపల్లె, మే 14: వ్యవసాయ మోటా ర్లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని, రాష్ట్రంలో రైతులకు డ్రిప్‌ పరికరాల ఎప్పుడిస్తారో నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 18న జిల్లా పర్యటనకు వస్తున్నారని, పులివెందుల నియోజకవర్గ నుంచి భారీగా సభకు ప్రజలు తరలిరావాల ని పిలుపిచ్చిన ఆయన వేంపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ ప్రభుత్వం డ్రిప్‌ పరికరాలు ఇవ్వలేదు, అలవలపాడులో ఎంపీ అవినా్‌షరెడ్డి త్వరలోనే ఇస్తామని ప్రకటించి నెల గడుస్తున్నా ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడైనా ఎప్పుడిస్తారో అధికారులు గానీ, ఎంపీ గానీ రైతులకు చెప్పాలని ఆయన కోరారు.

రైతులపై శ్రద్ద పెట్టకుండా వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం చూస్తుండడం శోచనీయమన్నారు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తే జగన్‌ ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని, కేసు లు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు.

గడపగడపకూ వైసీపీలో భాగంగా వైసీపీ నేతలు ఇళ్ల వద్దకు వచ్చినపుడు వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య ఎందు కు చేశారని అడుగుతారన్నారు. సీఎం జగన్‌ కూడా గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించాలన్నారు. జగన్‌పై సొంత జిల్లాలో ఎంత వ్యతిరేకత ఉందో చంద్రబాబు పర్యటనతో తేలనుందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మునిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆర్వీ రమేష్‌, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!