రాష్ట్రం ఎటు పోతోంది

ABN , First Publish Date - 2022-05-14T06:12:49+05:30 IST

రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం ఎటుపోతోందో అర్థం కావడం లేదని కడప పార్లమెంట్‌ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన దళిత బాలికను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా అనుమతి నిరాకరించారు. దీంతో రిమ్స్‌ ప్రాంగణంలోని వన్‌స్టా్‌ప సెంటర్‌ బయట వీరు నిరసన వ్యక్తం చేశారు. వన్‌స్టా్‌ప సెంటర్‌ అడ్మినిస్ర్టేటర్‌ అశ్వినితో మాట్లాడారు.

రాష్ట్రం ఎటు పోతోంది
వన్‌స్టాప్‌ సెంటర్‌ ఎదుట నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి

సీఎం సొంత జిల్లాలో కేసులు చూపడం లేదు 

కడప పార్లమెంట్‌ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగారెడ్డి

కడప(సెవెన్‌రోడ్స్‌), మే 13: రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం ఎటుపోతోందో అర్థం కావడం లేదని కడప పార్లమెంట్‌ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన దళిత బాలికను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా అనుమతి నిరాకరించారు. దీంతో రిమ్స్‌ ప్రాంగణంలోని వన్‌స్టా్‌ప సెంటర్‌ బయట వీరు నిరసన వ్యక్తం చేశారు. వన్‌స్టా్‌ప సెంటర్‌ అడ్మినిస్ర్టేటర్‌ అశ్వినితో మాట్లాడారు. అనంతరం కడప పార్లమెంట్‌ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. రోజుకు మూడు నాలుగు మానభంగాలతో రాష్ట్ర ఏమైపోతుందో అన్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో కేసులు కూడా కట్టడం లేదన్నారు. కేసులు కడితే రాష్ట్రం అతా తెలుస్తుందన్న భయం అధికారుల్లో ఉందన్నారు. దళిత బాలికను దాదాపు పది మంది అత్యాచారం చేస్తే కేసు కట్టకుండా పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారన్నారు. దళిత బాలికకు ఇంత అన్యాయం జరిగితే ప్రభుత్వం రక్షణ, ఆవాసం కల్పించకుండా ప్రైవేటు హోంలో చేర్పించారన్నారు. బాలికను పరామర్శించడానికి వెళితే అనుమతించలేదని, సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందని ప్రశ్నిం చారు. దళిత బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డి, జిలానీబాషా, మాసాపేట శివ, కొమ్మలపాటి రాజశేఖర్‌, మల్లేష్‌, బాలదాస్‌, శివరాం తదితరులు పాల్గొన్నారు.

Read more