లారీ ఢీకొని సాధువు మృతి

ABN , First Publish Date - 2022-05-15T04:57:04+05:30 IST

పట్టణ శివారు ఎర్రగుంట్ల బైపాస్‌ వాసవీ సర్కిల్‌ వద్ద లారీ ఢీకొనడంతో ఓ సాధువు మృతి చెందాడు.

లారీ ఢీకొని సాధువు మృతి

ప్రొద్దుటూరు క్రైం, మే 14: పట్టణ శివారు ఎర్రగుంట్ల బైపాస్‌ వాసవీ సర్కిల్‌ వద్ద లారీ ఢీకొనడంతో ఓ సాధువు మృతి చెందాడు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఘటన వివ రాల్లోకెళితే....  ముద్దనూరులోని ఓ ఆశ్రమంలో ఉంటున్న సాధువులు ప్రతి శనివారం భిక్షాటన కోసం ప్రొద్దుటూరుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు సాధువులు ప్రొద్దుటూరు వచ్చి, ఎర్రగుంట్ల బైపా్‌సలో టీ తాగి రోడ్డు దాటి వెళ్లిన మరోసాధువును అనుసరించే క్రమం లో మలుపు వద్ద లారీ ఢీకొంది. టైర్లు ఎక్కడంతో సాధువు అక్కడికక్కడే మృతి చెందా డు.

తోటి సాధువులు చెప్పిన మేరకు మృతుడు సాధువు పేరు లోకేశ్వర్‌రెడ్డి అని, వయస్సు 43 ఏళ్లు ఉంటాయని, స్వస్థలం కదిరి అని తెలిసిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ సీఐ యుగంధర్‌ తెలిపారు. 

Read more