ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చెరువు మట్టి తోడేస్తున్నారు

ABN, First Publish Date - 2022-05-07T05:46:01+05:30

గ్రావెల్‌ మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించడంతో మట్టి తరలింపునకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొత్త దారులు కనిపెట్టారు.

సంబేపల్లె చెరువులో జేసీబీతో శుక్రవారం తరలిస్తున్న మట్లి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అనుమతి వ్యవసాయానికి 

తరలించేది రియల్‌ ఎస్టేట్‌కు

ఇదో కొత్తరకం మట్టి వ్యాపారం


సంబేపల్లె, మే 6: గ్రావెల్‌ మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించడంతో మట్టి తరలింపునకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొత్త దారులు కనిపెట్టారు. వ్యవసాయ పొలానికి భూ సారవంతం కోసం చెరువు మట్టి పేరుతో రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ కోసం మట్టి తరలింపు మొదలుపెట్టారు. సంబేపల్లె చెరువులోని మట్టిని అక్రమంగా  శుక్రవారం తరలించారు.  15 రోజుల క్రితం ఇదే చెరువులో మట్టి తరలిస్తున్నట్లు సమాచారం  రావడంతో రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. సాధారణంగా చెరువులో మట్టి తవ్వకాల కోసం ఇరిగేషన్‌ అధికారులు అనుమతి తప్పనిసరి. అయితే రెవెన్యూ అధికారుల అనుమతి ఉందంటూ సంబేపల్లె చెరువు సర్వే నెంబరు 113 నుంచి చెరువు ఆనుకుని ఉన్న సర్వేనెంబరు 94/2లోని 9.40 ఎకరాల భూమిలో రియల్‌ ఎస్టేట్‌ కోసం మట్టిని కుప్పలు కుప్పలుగా తోలుతున్నారు. భూమి సారవంతం కోసం రెవెన్యూ అధికారులు  అనుమతిస్తే వారు వేల ట్రిప్పుల మట్టిని తరలించారు. రెవెన్యూ అధికారుల అనుమతులను సాకుగా చూపి యథేచ్ఛగా పట్టపగలే ఎక్స్‌కవేటర్ల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా సంబేపల్లె చెరువు నుంచి వందల ట్రిప్పులు మట్టిని తరలించారు. 15 రోజుల క్రితం దేవపట్ల గ్రామంలోని జమ్మిచెట్టుకుంటలో రాత్రి సమయంలో 1000 టిప్పర్ల మట్టిని తరలించారు. దీంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకర బావులును తలపిస్తున్నాయి. అప్పట్లో ఓ వర్గం వారు మట్టి తరలింపును అడ్డుకోవడంతో నిలిపివేశారు. ఈ విషయంపై ఇరిగేషన్‌ డీఈ చెన్నకేశవరెడ్డి వివరణ కోరగా తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. రెవెన్యూ అధికారుల అనుమతి చెల్లదన్నారు. తహసీల్దార్‌ సత్యానందంను వివరణ కోరగా వ్యవసాయ పొలానికి సారవంతమైన మట్టి తరలించడానికి కొన్ని టిప్పులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 


 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!