గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-11-07T00:25:21+05:30 IST

అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సంజీవపురంలో 8వ తరగతి చదువుతున్న నాదెర్ల కిషోర్‌ (13) మృతి చెందినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. అయ్యలరాజుపల్లె హరిజనవాడలోని నాదెర్ల సురేంద్రబాబు రెండవ కుమారుడు నాదెర్ల కిషోర్‌ సంజీవపురం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి
మృతి చెందిన నాదెర్ల కిషోర్‌

ఓబులవారిపల్లె, నవంబరు 6 : అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సంజీవపురంలో 8వ తరగతి చదువుతున్న నాదెర్ల కిషోర్‌ (13) మృతి చెందినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. అయ్యలరాజుపల్లె హరిజనవాడలోని నాదెర్ల సురేంద్రబాబు రెండవ కుమారుడు నాదెర్ల కిషోర్‌ సంజీవపురం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా చనిపోయినట్లు సమాచారం ఇవ్వగా హుటాహుటిన స్కూల్‌ వద్దకు వెళ్లినట్లు తెలిపారు. పాఠశాలలో ఏమి జరిగింది అన్న విషయాలు సంబంధించిన అదికారులు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ ప్రభావతిని వివరణ కోరగా చనిపోయిన అబ్బాయి అన్న కూడా ఇక్కడే చదువుతున్నాడని, ఉదయం టిఫిన్‌ కూడా సరిగ్గా తినలేదని అడగగా తనకు ఆరోగ్యం బాగా లేదన్నాడని, మధ్యాహ్నం భోజనం తరువాత స్టడీలో ఉండగా ఉన్నట్లుండి కుప్పకూలిపోగా ప్రధమ చికిత్స కొరకు ఏపీఎండీసీ ఆసుపత్రికి తరలించామన్నారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు పల్స్‌ అందలేదని విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారని ప్రిన్సిపాల్‌ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2022-11-07T00:25:21+05:30 IST

Read more