సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-05-15T04:55:38+05:30
సిద్ధవటం మండలం ఉప్పరపాళెం ఉప్పరపల్లి సచివాలయ సర్వేయర్ నల్లబెల్లి చిట్టిబాబు(42) ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్నచౌక్ ఎస్‌ఐ అమర్నాధ్‌రెడ్డి తెలిపారు.
కడప(క్రైం), మే 14: సిద్ధవటం మండలం ఉప్పరపాళెం ఉప్పరపల్లి సచివాలయ సర్వేయర్ నల్లబెల్లి చిట్టిబాబు(42) ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్నచౌక్ ఎస్‌ఐ అమర్నాధ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ అందించిన వివరాల్లోకెళి తే.... కడప అశోక్‌నగర్ వాసి న ల్లబల్లి చిట్టిబాబు రెండేళ్ల కింద ట గ్రామ సచివాలయ సర్వేయర్‌గా ఎంపికయ్యాడు. ఉప్పరపల్లి లో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడని శనివారం నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా న్ని రిమ్స్‌కు తరలిచారు. భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.