-
-
Home » Andhra Pradesh » Kadapa » Professionalism is superior-MRGS-AndhraPradesh
-
వృత్తి ధర్మం ఉన్నతమైనది
ABN , First Publish Date - 2022-05-15T04:30:15+05:30 IST
వృత్తిధర్మం ఎంతో ఉన్నతమైందని మాజీ విద్యాశాఖ అధికారి 17వ డివిజన్ కార్పోరేటర్ గుత్తిరెడ్డి చంద్రహాసరెడ్డి తెలిపారు.
సీకేదిన్నె, మే 14: వృత్తిధర్మం ఎంతో ఉన్నతమైందని మాజీ విద్యాశాఖ అధికారి 17వ డివిజన్ కార్పోరేటర్ గుత్తిరెడ్డి చంద్రహాసరెడ్డి తెలిపారు. మండలం చిన్నముసల్‌రెడ్డిపల్లెకు చెందిన రెండవ తరగతి విద్యార్థిని ఖాసీంబీ గుండెలో రంధ్రాలు ఉన్న విషయాన్ని గుర్తించిన ప్రధానోపాధ్యాయుడు రామాంజులరెడ్డి ఐఈఆర్‌టీ టీచర్ (భవిత సెంటర్) ఉపాధ్యాయురాలు వసుధ ద్వారా సిమ్స్ ఆస్పత్రిలో ఉచిత ఆపరేషన్ చేయించడం, ఖర్చులకు రూ.10 వేలు అందించిన ఉపాధ్యాయురాలు స్వరూపారాణిలను శనివారం ఘనంగా సన్మానించారు.

