ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ముగ్గురిపై పీడీ యాక్ట్‌ నమోదు

ABN, First Publish Date - 2022-05-14T06:12:00+05:30

ఒక అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌తో పాటు ఇద్దరు నాటుసారా విక్రయించే వారిపైనా పీడీయాక్ట్‌ నమోదు చేశామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలి పిన వివరాల మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వీరిలో ఇద్దరు నాటుసారా తయారీదారులు : ఎస్పీ

కడప(క్రైం), మే 13: ఒక అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌తో పాటు ఇద్దరు నాటుసారా విక్రయించే వారిపైనా పీడీయాక్ట్‌ నమోదు చేశామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ శుక్ర వారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలి పిన వివరాల మేరకు.. 

- బెంగళూరు సిటీ కటిగనహల్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ అతహుల్లాఖాన్‌ అలియాస్‌ అక్రమ్‌ అలియాస్‌ అతుల్‌ నాలుగు సంవత్సరాల నుంచి ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. జిల్లాలో ఇప్పటివరకు ఇతనిపై 11 కేసులు ఉన్నాయి. తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి బాలుపల్లి, అ ట్లూరు, గువ్వలచెరువు, సుండుపల్లి ప్రాం తాల్లో ఎర్రచందనం దుంగలను నరికించి అక్రమంగా రవాణా చేసేవాడు. ఇతనిపై పీడీ యాక్ట్‌ నివేదిక తయారు చేసి కలెక్టర్‌ విజయరామరాజుకు పంపించగా ఆయన ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సెంట్రల్‌ జైల్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ ప్రకా్‌షకు పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు అందజేశారు.

- మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన ఎన్‌.కల్యాణకుమార్‌, పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన పాలగొర్ల చిన్నగంగరాజు నాటు సారా తయారు చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వద్ద నుంచి వందలాది లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న వీరిపై జిల్లా వ్యాప్తంగా 7 కేసులు ఉన్నాయి. వీరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ నివేదికను కలెక్టర్‌కు సమర్పించడంతో ఆయన ఆమోదిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. దీంతో వీరిని కడప కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!