ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ABN, First Publish Date - 2022-05-15T05:07:31+05:30

హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే కౌంటర్‌ దాఖలు చేసి కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తహసీల్దార్లను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తహసీల్దార్లను ఆదేశించిన కలెక్టర్‌ గిరీషా


రాయచోటి (కలెక్టరేట్‌), మే 14: హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే కౌంటర్‌ దాఖలు చేసి కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో హైకోర్టులో పెండింగ్‌ కేసులపై తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైకోర్టు నుంచి వచ్చిన కేసుల్లో ఫైనల్‌ ఆర్డర్స్‌ అమలు పరచాలని, అవకాశం లేకుంటే వెంటనే అప్పీలుకు వెళ్లాలన్నారు. అలాగే పెండింగ్‌ కేసులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వచ్చినట్లయితే వాటిని అమలు చేయాలని, లేకుంటే స్టే ఆర్డర్‌ రద్దు పరచడానికి పిటీషన్‌ దాఖలు చేయాలన్నారు. హైకోర్టు ధిక్కార కేసులు నమోదు కాకుండా నోటీసులు అందిన వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసి పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. జిల్లాలో అనధికార లేఅవుట్‌లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, అటువంటి వాటిని వెంటనే ఆపాలని తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ల్యాండ్‌ కన్వర్షన్‌ తప్పకుండా చేసుకోవాలని, అలా కాకుండా వ్యవసాయ భూమిలో లేఅవుట్‌ వేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి జిల్లాలో ఎక్కడా అగ్రికల్చర్‌ ల్యాండ్‌ లేఅవుట్‌లో రిజిస్ర్టేషన్‌ జరగరాదన్నారు. సమవేశంలో డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, కలెక్టరేట్‌ ఏవో బాలకృష్ణ, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!