పంట నష్టంపై జెడ్పీ చైర్మన్ ఆరా!
ABN, First Publish Date - 2022-05-15T05:01:44+05:30
తుఫాను కారణంగా ఆకేపాడు చుట్టుపక్క ల గ్రామాల్లో దెబ్బ తిన్న అరటితోటలను ఉద్యానశాఖాధికారి హరినాఽథరెడ్డితో కలిసి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాఽథ రెడ్డి శనివారం పరిశీ లించారు.
రాజంపేట, మే 14: తుఫాను కారణంగా ఆకేపాడు చుట్టుపక్క ల గ్రామాల్లో దెబ్బ తిన్న అరటితోటలను ఉద్యానశాఖాధికారి హరినాఽథరెడ్డితో కలిసి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాఽథ రెడ్డి శనివారం పరిశీ లించారు. బాధిత రైతులతో మాట్లాడి జరిగిన నష్టాలపై ఆరా తీశారు. జిల్లా అధి కారులకు ఫోన్ చేసి పంట నష్టాలను అంచనా వేసి, నివేదికలు సమర్పిస్తే నష ్టపరిహారం మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పెనుగాలులు, తుఫానుతో రాజంపేట నియోజకవర్గంలో అరటి, బొప్పాయి, మామి డి తోటలకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. వీరిని ఆదుకోవడానికి శక్తివంచ న లేకుండా కృషి చేస్తామన్నారు.