నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-05-15T05:00:13+05:30 IST

: పెనుగాలుల కారణంగా పంట నష్టపోయిన బాలిరెడ్డిగారిపల్లె, రాచపల్లె, గంగనేరు, ఉప్పరపల్లె, మంగళపల్లె, కొలిమివాడ్లపల్లె తదితర గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ నాయకుల మదన, యువరాజు, నాగేంద్రరెడ్డి, రవీంధర్‌రెడ్డి, ఇమామ్‌ఖాసీం, రాజా, నాగభూషణ్‌రెడ్డి, వేణుగోపాల్‌, చాంద్‌బాషా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మామిడి తోటను పరిశీలిస్తున్న మండల టీడీపీ నాయకులు

రామాపురం, మే14: పెనుగాలుల కారణంగా పంట నష్టపోయిన బాలిరెడ్డిగారిపల్లె, రాచపల్లె, గంగనేరు, ఉప్పరపల్లె, మంగళపల్లె, కొలిమివాడ్లపల్లె తదితర గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ నాయకుల మదన, యువరాజు, నాగేంద్రరెడ్డి, రవీంధర్‌రెడ్డి, ఇమామ్‌ఖాసీం, రాజా, నాగభూషణ్‌రెడ్డి, వేణుగోపాల్‌, చాంద్‌బాషా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  శనివారం వారు దెబ్బతిన్న తోటలు పొలాలను పరిశీలించారు.  మామిడి తోటలు, వరి పైరుకు ఎకరాకు రూ.50 వేలు, ప్రొద్దుతిరుగుడు కు రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Read more