-
-
Home » Andhra Pradesh » Kadapa » Jagana rule with the aim of earning-MRGS-AndhraPradesh
-
సంపాదనే ధ్యేయంగా జగన పాలన
ABN , First Publish Date - 2022-05-15T04:32:45+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి పాలన సంపాదనే ధ్యేయంగా కొనసాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు
కడప(ఎర్రముక్కపల్లి), మే 14 : ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి పాలన సంపాదనే ధ్యేయంగా కొనసాగుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కడప నగరం 14, 15 డివిజనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న పన్నుల భారం, కరెంట్ చార్జీలు ఇంటి పన్ను, కుళాయిపన్ను చెత్తపన్ను, పెంపుదలను నిరసిస్తూ శనివారం బాదుడే బాదుడు కార్యక్రమం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బా లదాసు, కొండాసుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇనచార్జ్ అమీర్‌బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదిర్శ గోవర్థనరెడ్డి, హరిప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, అలంఖానపల్లి లక్ష్మీరెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సీఎం జగనమోహనరెడ్డి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. సంపాదనే ధ్యేయంగా పాలన సాగిస్తూ కరెంట్ చార్జీలు, నీటి పన్ను, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి పేద ప్రజలపై మోయలేని భారాన్ని మోపి అన్ని విధాలుగా దోపిడీ పాలన సాగిస్తున్నారన్నారు. అమ్మ ఒడి పేరుతో ప్రజలను మోసంగిస్తూ దుర్మార్గ పాలన సాగిస్తున్నారన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలు ఆమోదం పొందిన పాలన కొనసాగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జైకుమార్, సన్నపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, వెంకటేష్ యాదవ్, కొమ్మలపాటి సుబ్బరాయుడు, గన్యపాటి మల్లేష్, వెంకటే్‌షయాదవ్, బుఖారి, జనార్థనరెడ్డి, వరప్రసాద్, సుధాకర్‌యాదవ్, మన్నూరు అక్బర్ తదితరులు టపాల్గొన్నారు.

