ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

లబ్ధిదారులకు ‘ఇంటి’ తిప్పలు

ABN, First Publish Date - 2022-05-10T05:43:02+05:30

మండల కేంద్రమైన సిద్దవటం గ్రామ సమీపంలోని జగనన్న లేఅవుట్‌ కాలనీలో మౌలిక వసతుల కొరత లబ్ధిదారులకు సంకటంగా మారింది. ఇంటిని నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నా నీరు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పనులకు ఆటంకంగా మారింది. బేస్‌మట్టం వేసేందుకు సుమారు రూ.5 వేలు ఖర్చు చేసుకొని ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లబ్ధిదారులు నారాయణమ్మ, బసరోన్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి నీటిని అందించాలని వేడుకుంటున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నీటి కొరతతో ఆగిపోతున్న పునాదులు 

ఇదీ సిద్దవటం జగనన్న లేఅవుట్‌లో దుస్థితి 

సిద్దవటం, మే 9: మండల కేంద్రమైన సిద్దవటం గ్రామ సమీపంలోని జగనన్న లేఅవుట్‌ కాలనీలో మౌలిక వసతుల కొరత లబ్ధిదారులకు సంకటంగా మారింది. ఇంటిని నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నా నీరు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పనులకు ఆటంకంగా మారింది. బేస్‌మట్టం వేసేందుకు సుమారు రూ.5 వేలు ఖర్చు చేసుకొని ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లబ్ధిదారులు నారాయణమ్మ, బసరోన్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వలన ఇంటి నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని వారు వాపోతున్నారు. ఈ కాలనీలో 137 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాల మంజూరు కాగా, వాటిలో కేవలం పది మంది మాత్రమే బేస్‌మట్టం పూర్తి చేశారు. అధికారులు లబ్ధిదారుల బేస్‌మట్టం నిర్మాణం కొరకు నీరు అందించకపోవడం వల్ల లబ్ధిదారులే ఒక ట్యాంకర్‌ నీటిని రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి బేస్‌మట్టం పనులను కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా నీటి సమస్య తీర్చేందుకు కొత్త బోర్‌ ఏర్పాటు కొరకు టెండర్‌ పూర్తైన వెంటనే తాగునీటి సరఫరా ఏర్పాటు చేస్తామని, అలాగే విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ ద్వారా లబ్ధిదారుల గృహాలకు నీటి సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!