నేటి నుంచి ఉచిత ఆరోగ్య యోగా తరగతులు
ABN, First Publish Date - 2022-05-15T05:07:35+05:30
ఆరోగ్య సంరక్షణ కోసం హైదరాబాద్ యోగా విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు జగన్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఉచిత ఆరోగ్య యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసభ కార్యదర్శి మురికి నాగేశ్వరరావు తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్, మే 14 : ఆరోగ్య సంరక్షణ కోసం హైదరాబాద్ యోగా విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు జగన్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఉచిత ఆరోగ్య యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసభ కార్యదర్శి మురికి నాగేశ్వరరావు తెలిపారు. పురుషులకు వాసవి ఉద్యానవనంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, పిల్లలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు, పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీవాసవి గాధంశెట్టి చెంచయ్య కల్యాణ మండపంలో యోగా తరగతులు నిర్వహిస్తామన్నారు. 22న ప్రకృతి ఆహారం, చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటల తయారీ, ప్రయోజనాల గురించి వివరిస్తారన్నారు.