-
-
Home » Andhra Pradesh » Kadapa » Establishment of permanent bus shelters-MRGS-AndhraPradesh
-
శాశ్వత బస్ షెల్టర్ల ఏర్పాటు
ABN , First Publish Date - 2022-05-15T04:29:35+05:30 IST
పులివెందులలో ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు దాదాపు నెలన్నర తర్వాత శాశ్వత బస్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు.
పులివెందుల రూరల్, మే 14: పులివెందులలో ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు దాదాపు నెలన్నర తర్వాత శాశ్వత బస్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. పులివెందుల ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (పాడా) నిధుల కింద దాదాపు రూ.59లక్షలు కేటాయించి ఐదుచోట్ల బస్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. పులివెందుల పాత ఆర్టీసీ బస్టాండ్, పూలంగళ్ల సమీపంలోని మసీదు వద్దనున్న కాంప్లెక్స్ వద్ద, పార్నపల్లె బస్టాండ్ వద్ద, అన్నా క్యాంటీన వద్ద, కదిరి రోడ్డు (ఇంకా పూర్తికాలేదు) వద్ద శాశ్వత బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఆ బస్ షెల్టర్ల వద్ద ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. పలుచోట్ల పలుచోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పూర్తైన బస్‌షెల్టర్లను శనివారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం ఉమామహేశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్మన వరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన వైఎస్ మనోహర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా మరుగుదొడ్లను, తాగునీటి సమస్యలను పరిశీలించారు. బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ సౌకర్యాలు కల్పించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

