23 మంది వలంటీర్లు విధుల నుంచి తొలగింపు
ABN, First Publish Date - 2022-05-14T05:43:45+05:30
బయోమెట్రిక్ హాజరు వేయడంలో నిర్లక్ష్యం వహించిన 23 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో రమే్‌షబాబు తెలిపారు.
ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
బయోమెట్రిక్ వేయడంలో నిర్లక్ష్యమే కారణం
ములకలచెరువు, మే 13: బయోమెట్రిక్ హాజరు వేయడంలో నిర్లక్ష్యం వహించిన 23 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో రమే్‌షబాబు తెలిపారు. అలాగే ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని వలంటీర్లు నెలకు 12 రోజులు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వ నిబంధన ఉంది. అయితే బురకాయలకోట, గూడుపల్లె, కదిరినాధునికోట, కాలువపల్లె, మద్దినాయనిపల్లె, ములకలచెరువు, సోంపల్లె, చౌడసముద్రం గ్రామాలకు చెందిన 23 మంది వలంటీర్లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి బయోమెట్రిక్ వేయలేదు. వీరి పనితీరు గమనించకుండా ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు జీతాలు చెల్లించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. తొలగించిన వలంటీర్ల నుంచి సెల్‌ఫోన్లు, బయోమెట్రిక్ స్కానర్ స్వాధీనం చేసుకోవాలని సూచించారు.