ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కొటాల గుట్టపై మళ్లీ వివాదం

ABN, First Publish Date - 2022-05-15T05:09:36+05:30

మండలంలోని పత్తేగడ పంచాయతీ కొటాల గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టను చదును చేయడంపై మళ్లీ వివాదం రేగింది.

ఎక్స్‌కవేటర్‌తో గుట్టను చదును చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చదును చేస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు


కలికిరి, మే 14: మండలంలోని పత్తేగడ పంచాయతీ కొటాల గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టను చదును చేయడంపై మళ్లీ వివాదం రేగింది. ఇళ్ల స్థలాల పేరుతో కొంతమంది గ్రామస్థులు శనివారం ఎక్స్‌కవేటర్‌తో చదును చేయడం ప్రారంభించారు. దీంతో మరో వర్గం వారు ఇది ఇళ్ల స్థలాల కోసం కాదని కేవలం గుట్టను ఆక్రమించుకోవడానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్డుకున్నారు. సెలవు రోజు కావడంతో వివాదానికి సంబంధించిన సమాచారం స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికెళ్లినా స్పందించలేకపోయారు. జగనన్న కాలనీ కోసమంటూ గత ఏడాది అక్టోబరులో కూడా గుట్టను చదును చేయడానికి ఒక వర్గం స్థానికులు ప్రయత్నించారు. అప్పుడు కూడా మరో వర్గం వారు అడ్డుకుని  రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని దాదాపు 150 పాడి ఆవులున్నాయని, వాటి మేత కోసం ఈ గుట్ట ఒక్కటే ఆధారమని విన్నవించారు. దీంతో అప్పుడు తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. కొటాల గ్రామ శివారులో సర్వే నెంబరు 600/3లో 18 ఎకరాల గుట్ట ఉందని, జగనన్న ఇళ్ల పేరుతో దానిని చదును చేయడానికి ఒక వర్గం తరచూ ప్రయత్నిస్తోందని మరో వర్గం ఆరోపిస్తోంది. ఇళ్ల స్థలాల కోసమైతే ప్రభుత్వమే చదును చేయాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు ఇలా ఎక్స్‌కవేటర్లు పెట్టి గుట్టలను పాడు చేయడమేటని చెప్పుకొచ్చారు. కొండలు, గుట్టలు ఇతర ప్రజా ప్రయోజనకరమైన ప్రాంతాల్లో జగనన్న ఇళ్లకు స్థలాలు కేటాయించవద్దని ప్రభుత్వమే ఆదేశాలిచ్చినట్లు ఆధారాలు చూపుతున్నారు. చివరకు విషయం జిల్లా అధికారుల వరకూ వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని తగిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ వివాదానికి మళ్లీ తాత్కాలికంగా తెరపడింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!