ముగిసిన డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-15T05:00:53+05:30 IST

కడప వైవీయూనివర్సిటీలో డిగ్రీ కళాశాలల 1వ, మూడో సెమిస్టర్‌ పరీక్ష లు శనివారంతో ముగిశాయి.

ముగిసిన డిగ్రీ పరీక్షలు
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న సీఈ డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి

కడప వైవీయూ, మే 14: కడప వైవీయూనివర్సిటీలో డిగ్రీ కళాశాలల 1వ, మూడో సెమిస్టర్‌ పరీక్ష లు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యా ప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షల్లో 90 మంది విద్యార్థులు డిబార్‌ అయ్యారు. వైవీయూ పరిధి డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు ఈనెల మూడు నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.

వీసీ సూర్యకళావతి నేతృత్వంలో పరీక్షల తనిఖీలకు 14 బృందాలను ఏర్పాటు చేశా రు. జిల్లాలోని 60 కేంద్రాల్లో 25,301 మంది విద్యార్థులు పరీక్షలు రా శారు. చివరి రోజు కోడూరు, ఓబుళవారిపల్లె, ఒంటిమిట్ట డిగ్రీ కళాశాలల కేంద్రాలను వైవీయూ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నలుగురు విద్యార్థులు శనివా రం డిబార్‌ అయ్యారని ఆయన తెలిపారు. 

Read more