ఆరోగ్య కేంద్రం తనిఖీ
ABN, First Publish Date - 2022-05-15T04:51:13+05:30
మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ క్వా లిటీ అస్యూరిటీ స్టాండర్డ్స్ కమిటీ బృందం అధికారులు శనివారం తని ఖీ చేశారు.
మైలవరం, మే 14: మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ క్వా లిటీ అస్యూరిటీ స్టాండర్డ్స్ కమిటీ బృందం అధికారులు శనివారం తని ఖీ చేశారు. కమిటీ బృందంలోని డాక్టర్లు రూపాలి అగర్వాల్, దేవేంద్రగజ్జర్ హాస్పిటల్‌లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్, రోజుకు వస్తున్న రోగుల వివరాలు, ల్యాబ్, లేబర్ రూమ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న రికార్డులను, ఆయా ప్రాంతా ల్లో తీసిన ఫొటోలు, ప్రజలకు అందించే పలు కార్యక్రమాల రికార్డుల ను పరిశీలించి ప్రస్తుతం హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది పని తీరు గ్రా మీణ ప్రాంతాల్లో ప్రజలు అందించే సేవలపై వైద్య అదికారులు, వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు అజర య్య, చంద్రకుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.