కువైత్‌లో చదిపిరాళ్ల వాసి మృతి

ABN , First Publish Date - 2022-05-15T04:50:06+05:30 IST

మండల పరిధి చదిపిరాళ్ల వాసి కొపోలి జయచంద్ర(54) కువై త్‌లో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కువైత్‌లో చదిపిరాళ్ల వాసి మృతి
కొప్పొలు జయచంద్ర(ఫైల్‌ఫొటో)

కమలాపురం రూరల్‌, మే 14: మండల పరిధి చదిపిరాళ్ల వాసి కొపోలి జయచంద్ర(54) కువై త్‌లో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని భార్య కొప్పోలు పుష్పావతి ఇచ్చిన సమాచారం మేరకు రెండు నెలల కిం దట జీవనోపాధి కోసం కువైత్‌కి వెళ్లారని అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కువైత్‌ నుంచి సమాచారం అందిం దన్నారు. జీవనోపాధి కోసం దేశం విడిచిపెట్టి వెళ్లి తిరిగిరాని లోకాల కు వెళ్లావా అని మృతుని భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందు కు అధికారులు స్పందించాలని ఆమె వేడుకున్నారు. మృతునికి భార్య ఉంది. పిల్లలు లేరు ఒక పిల్లవాని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. జయచంద్ర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Read more