ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించినా మట్టి తరలించినా కేసులు

ABN , First Publish Date - 2022-05-14T06:09:32+05:30 IST

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినా, యంత్రా లతో మట్టిని తరలించినా కేసులు పెట్టాలని కలెక్టర్‌ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పోరుమామిళ్ల మండలంలో పర్యటించారు. ముందుగా స్త్రీశక్తి భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ విషయంలో పెండింగ్‌ పెట్టవద్దని జగనన్న కాలనీల నిర్మాణం వేగవంతంగా జరగాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించినా మట్టి తరలించినా కేసులు
పోరుమామిళ్ల చెరువుకట్ట సమీపంలో ఆయకట్టు విస్తీర్ణం గురించి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆదేశం

పోరుమామిళ్ల, మే 13: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినా, యంత్రా లతో మట్టిని తరలించినా కేసులు పెట్టాలని కలెక్టర్‌ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పోరుమామిళ్ల మండలంలో పర్యటించారు. ముందుగా స్త్రీశక్తి భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ విషయంలో పెండింగ్‌ పెట్టవద్దని జగనన్న కాలనీల నిర్మాణం వేగవంతంగా జరగాలని ఆదేశించారు. అనంతరం ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. అలాగే పోరు మామిళ్ల చెరువును పరిశీలించి ఆయకట్టు విస్తీర్ణం ఎంత, ఎంత నీరు నిల్వ ఉంది తదితర విషయాలపై ఆరా తీశారు. పెండింగ్‌ పనులను, చింతలపల్లె రెగ్యులేటర్‌, బ్రిడ్జీలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించినా, మట్టిని తరలించినా ఉపేక్షించకుండా కేసులు పెట్టాలన్నారు. అలాగే సగిలేరు బ్రిడ్జి, కాలువలను పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో వెంకటరమణ, తెలుగుగంగ ఎస్‌ఈ శారద, ఈఈ బాలాజీరావు, డీఈ మర్రెడ్డి, తహసీల్దార్‌ విజయకుమారి, ఎంపీడీవో నూర్జహాన్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటసుబ్బారావు, తెలుగుగంగ ఏఈలు పాల్గొన్నారు. 


Read more