భక్తిశ్రద్ధలతో నృసింహ జయంతి
ABN, First Publish Date - 2022-05-15T04:57:39+05:30
భక్తిశ్రద్ధలతో నృసింహ జయంతి
సుండుపల్లె, మే 14: నరసింహ జయంతి సందర్భంగా శనివారం బేరిపల్లె ఆలయంలో ఆలయ ధర్మకర్త, బేరిపల్లె శ్రీధర్ ఆధ్వర్యంలో పూజలు, అభి షేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏ ర్పాటు చేసిన వేదికపై లక్ష్మి, నరసింహాస్వామి ఉత్సవమూర్తులకు కల్యాణం చేశారు. సుండుపల్లె శివాలయంలో అర్చకుడు బాలసుబ్రమణ్యంశర్మ నర సింహస్వామికి అభిషేకం చేసి గంధంతో అలంక రించి భక్తులకు దర్శనం కల్పించారు.
వీరబల్లి: మండలంలోని పెద్దివీడు నరసింహస్వామి ఆలయంలో శనివారం నరసింహ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. అభిషేకం, హోమా లు నిర్వహించారు. వచ్చిన ప్రజలకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం చేశారు.
లక్కిరెడ్డిపల్లె: చౌటపల్లె పంచాయతీ రవీంద్ర నగర్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శని వారం ఓబుల్‌రెడ్డి దంపతులు, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితు డు నారాయణస్వామి బృందం హోమం, గణపతి పూజ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్య క్రమం నిర్వహించారు. నిర్వాహకులు నరసింహ రాజు, నాగేంద్ర, బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌యాదవ్, శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు.
రైల్వేకోడూరు: రెడ్డివారిపల్లె పరిధిలోని లక్ష్మీనృశింహస్వామి ఆలయంలో శనివారం నృసింహ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పండ్రా నరసింహులు ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు, అగ్ని ప్రణయనం, కుంభారాధన, హోమం, స్వర్ణపుష్పార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు సాయిరాం, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
చిన్నమండెం: దేవగుడిపల్లెలోని మండెం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఆదివారం ధ్వజారోహణం, సోమవారం కలశారాధన, హోమం, బుధవారం కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పెంచల స్వామి ఆలయంలో
పెనగలూరు: ఈటిమాపురం గుట్టపై వెలసిన పెంచలనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శని వారం రాత్రి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. తిరుపతికి చెందిన బాలాజీస్వామి పండి తుల బృందం శ్రీవారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బత్తిన చారిటబుల్ ట్రస్ట్, లక్ష్మీ నరసింహస్వామి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య భజన కళా కారుల బృందం అన్నమయ్య గీతాలను ఆలపించింది .ఈటిమాపురంలోని రాజుపాలెం గ్రామ పెద్దలు యూత్ సభ్యుల సహకారంతో అన్నదానం చేశారు. కల్యాణోత్సవం తరువాత గరుడ వాహనంపై ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల బురుజుల వరకు గ్రామోత్సవం నిర్వహించారు. నాయుడువారిపల్లె, కురవలి గిరిజన గ్రామాల ప్రజలు తమ ఆడబిడ్డగా భావించే చెంచులక్ష్మీ అమ్మవారికి సంప్రదాయం ప్రకారం పలురకాల పుష్పాలు, ఫలాలతో సారెను సమర్పించుకున్నారు. ఈటిమాపురం, నాయుడువారి పల్లె, తూర్పుపల్లె, మూగావారిపల్లె, సింగనమల, సింగారెడ్డిపల్లె, కంబాలకుంట, గట్టువారిపల్లె, వెలగ చెర్ల తదితర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా కంబాలకుంటకు చెందిన గొబ్బూరు ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు పెనగలూరు, రాజంపేట మధ్యలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, పాదచారులకు మజ్జిగ, పానకాన్ని అందించి తమ భక్తిని చాటుకున్నారు.
రాజంపేట టౌన్ : మండలంలోని భువనగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, స్వస్తి వచనం, పంచామృతాభిషేకం, సహస్ర నామార్చన అనంత రం ధ్వజారోహణ చేశారు. జయంతి సుబ్బ రామయ్య కుటుంబీకులు ఈ కార్యక్రమాలను ప్రారం భించారు. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు టీడీపీ నియోజకవర్గ నాయకులైన పసుపులేటి వీరప్రదీప్కుమార్, వీరపవన్కుమార్ తదితరులు పూజలు చేశారు. వీరి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లపై సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో దేవతా మూర్తుల విగ్రహాలతో సర్వాంగసుందరంగా తీర్చి దిద్దారు.