దళితులపై అధికార పార్టీ నేతల దాడి

ABN , First Publish Date - 2022-05-15T04:56:26+05:30 IST

మండలంలోని ఎనమలచింతలలో అధికార పార్టీ నేతలు దళితుల పై దాడి చేసినట్లు ఎమ్మార్పీఎస్‌ నేతలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దళితులపై అధికార పార్టీ నేతల దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్‌ నేతలు

కొండాపురం, మే 14: మండలంలోని ఎనమలచింతలలో అధికార పార్టీ నేతలు దళితుల పై దాడి చేసినట్లు ఎమ్మార్పీఎస్‌ నేతలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తెల్లవారుజామున అధికార పార్టీకి చెందిన చవ్వనాగయ్యపల్లెకు చెందిన చప్పిడి లక్ష్మికాంతరెడ్డి, కసనూరు నాగేశ్వరరెడ్డి దళితులైన ధర్మవరం సూర్యనారాయణ పై దాడి చేసినట్లు మండల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు నాగసుబ్బరాయుడు బాధితునితో కలిసి తాళ్లప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో సూర్యనారాయణపై వీరు దాడి చేసినట్లు వారు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇటీవల దళితులపై అగ్రవర్ణాల వారి దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా న్యాయం చేయాలని బాధితుడితో కలిసి ఎమ్మార్పీఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా సంఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.

Read more