రేపటి నుంచి అన్నమాచార్యుల జయంత్యుత్సవాలు

ABN , First Publish Date - 2022-05-15T04:54:44+05:30 IST

తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయం త్యుత్సవాలు 16న సోమవారం నుంచి జరుగుతాయని టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి ప్రకటించారు.

రేపటి నుంచి అన్నమాచార్యుల  జయంత్యుత్సవాలు

రాజంపేట టౌన్‌, మే 14: తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయం త్యుత్సవాలు 16న సోమవారం నుంచి జరుగుతాయని టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి ప్రకటించారు. తాళ్లపాక ధ్యాన మందిరం, అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ప్రాంతాల్లో 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తాళ్లపాక ధ్యానమంది రం వద్ద 16న ఉదయం నాదస్వర సమ్మేళనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్టిగానం జరుగుతుందన్నారు. అదే రోజు ఉదయం 10గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహిస్తామన్నారు.

సాయంత్రం సంగీత సభ, హరికథ జరుగుతుందన్నారు. అనంతరం శ్రీవారి ఊంజల సేవ ఉంటుందన్నారు. 17వ తేదీ మంగళవారం తాళ్లపాక ధ్యానమందిరం వద్ద మహబూబ్‌నగర్‌కు చెందిన గద్వాల చంద్రశేఖర్‌రావు బృందంచే సంగీత సభ, రాత్రి 8 గంటలకు హరికథ, అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం సంగీత సభ, హరికథ ఉంటాయన్నారు. 18వ తేదీ బుధవారం సాయంత్రం తాళ్లపాకలో సంగీత సభ, హరికథ నిర్వహిస్తారన్నారు.

Read more