అధికారంలోకి వస్తే యధావిధిగా అన్నా క్యాంటిన్‌

ABN , First Publish Date - 2022-05-15T05:01:45+05:30 IST

అధికారంలోకి వస్తే యధావిధిగా అన్నా క్యాంటిన్లు నిర్వహిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

అధికారంలోకి వస్తే యధావిధిగా అన్నా క్యాంటిన్‌
నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

మరోసారి నిరసన తెలిపిన టీడీపీ నేతలు 

కడప(ఎర్రముక్కపల్లి), మే 14: అధికారంలోకి వస్తే యధావిధిగా అన్నా క్యాంటిన్లు నిర్వహిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. కడ ప నగరం పాత మున్సిపల్‌ ఆఫీ సు వద్ద శనివారం అన్నా క్యాంటి న్‌ కూల్చివేత పనులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అనంతరం అన్న క్యాంటిన్‌ వద్ద బయట నుం చి నిరసన చేపట్టారు. నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తెలుగురైతు నేత జి.లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ ప్రజా వేదిక కూల్చివేతతో పరిపాలన మొదలు పెట్టిన వైసీపీ ప్రభు త్వం చివరకు భవంతులు కూల్చివేస్తూ చం ద్రబాబు నిర్మించిన ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.

అన్నా క్యాంటిన్‌ కూల్చివేత పనులను గతం లో అడ్డుకుని నిలపగలిగామని మళ్లీ శనివా రం కార్పొరేషన్‌ అధికారులు అన్న క్యాంటిన్‌ కూల్చివేత పనులు ప్రారంభిస్తుంటే అడ్డుకొనడంతో వారు ఎక్స్‌కవేటర్‌తో పని చేయించే అధికారులు పారిపోయారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

కార్యక్రమంలో జలతోటి జయకుమా ర్‌ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి గన్నిపాటి మల్లేసు, నక్కల శివరామ్‌, ఆమూరి బాలదా సు, మాజీ కార్పొరేటర్‌ వికా్‌స హరికృష్ణ, ఎంపీ సురేష్‌, బుఖారీ, జీయా ఉద్దీన్‌, మాసాపేట శివ, నాసర్‌ అలీ, కొండా సుబ్బయ్య, సానపురెడ్డి, నబికోట శ్రీనివాసులు, ఓబుల్‌రెడ్డి, ఓబులేసు, కొమ్మలపాటి, తెలుగు యువత రాష్ట్ర నిర్వాహక  కార్యదర్శి జియావుద్దీన్‌, షేక్‌ ఇమ్రాన్‌, అనిల్‌కుమార్‌, గౌస్‌, ఐటీడీపీ థా మస్‌, టీడీపీ నగర నేతలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Read more