కోదండరాముడి సేవలో అనంతపురం జిల్లా జడ్జి

ABN , First Publish Date - 2022-05-15T04:59:00+05:30 IST

ఒంటిమిట్ట కోదండ రాముడిని అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో శని వారం రాత్రి దర్శించుకు న్నారు.

కోదండరాముడి సేవలో అనంతపురం జిల్లా జడ్జి
కోదండరాముడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

ఒంటిమిట్ట, మే14 : ఒంటిమిట్ట కోదండ రాముడిని అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో శని వారం రాత్రి దర్శించుకు న్నారు. వీరికి టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో కడప జిల్లా జడ్జి గా పనిచేసిన శ్రీనివాసులు కోదండరాముడిని దర్శించుకున్నారు. వీరికి సీఐ రాజా ప్రభాకర్‌, ఎస్‌ఐ సంజీవరాయుడు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Read more