ఎన్‌సీఎల్‌ఏటీ న్యాయ సభ్యుడిగా జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి

ABN , First Publish Date - 2022-05-14T08:17:51+05:30 IST

ఎన్‌సీఎల్‌ఏటీ న్యాయ సభ్యుడిగా జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి

ఎన్‌సీఎల్‌ఏటీ న్యాయ సభ్యుడిగా జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి

న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) న్యాయ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ చేసిన ప్రతిపాదనలకు నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఆయనతో పాటు పంజాబ్‌, హరియాణా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ జైన్‌, పాట్నా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ న్యాయ సభ్యులుగా, కేంద్ర న్యాయ శాఖ మాజీ కార్యదర్శి బరున్‌ మిత్రా, రైల్వే బోర్డు ఆర్థిక సభ్యుడు నరేశ్‌ సలేచా సాంకేతిక సభ్యులుగా నియమితులయ్యారు. కాగా, మచిలీపట్నానికి చెందిన జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి ఉమ్మడి రాష్ట్రంలో 2013లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జూన్‌ 13న న్యాయమూర్తిగా ఆయన పదవీ విమరణ చేయనున్నారు. ట్రైబ్యునల్‌ న్యాయ సభ్యుడిగా నాలుగేళ్ల పాటు లేదా 67 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కొనసాగుతారు. 

Read more