జగన్‌ వచ్చాక అత్యాచారాలు పెరిగిపోయాయి: Chandrababu

ABN , First Publish Date - 2022-05-13T02:51:06+05:30 IST

ఈ మూర్ఖుడు వచ్చాక రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ ఎస్సీ మహిళను పది మంది కలిసి అత్యాచారం

జగన్‌ వచ్చాక అత్యాచారాలు పెరిగిపోయాయి: Chandrababu

కుప్పం: ‘ఈ మూర్ఖుడు వచ్చాక రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ ఎస్సీ మహిళను పది మంది కలిసి అత్యాచారం చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో రోజుకో చోట ఇలాంటి అత్యాచార అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో గురువారం రెండో రోజు పర్యటన కొనసాగింది. గుడుపల్లె మండలంలోని పొగురుపల్లెలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్‌, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుకోవాలని, ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరగడం సహజమని మహిళా మంత్రి చెప్పడం దారుణమన్నారు. బాబాయిని చంపగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. గొడ్డలి పోటును గుండె పోటుగా మార్చి చెప్పగలిగే నాయకుడు కూడా అతనొక్కడేనని చంద్రబాబు దుయ్యబట్టారు.

Read more