ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏపీలో బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా

ABN, First Publish Date - 2022-05-11T02:35:39+05:30

ఏపీలో బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీలో బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. అసని తుపాను కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రద్దు చేసిన ఇంటర్ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.


బంగాళా ఖాతంలో ఏర్పడిన పెను తుపాను అసని  (Cyclone Asani)  దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ తుపాను ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని మొదట్లో భావించినప్పటికీ, ఇది దిశ మార్చుకుని ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోందని పేర్కొంది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోందని, ఆ తర్వాత విశాఖపట్నం వద్ద సముద్రంలోకి వెళ్ళవచ్చునని అంచనా వేస్తోంది. 


అసని తుపాను (Cyclone Asani) ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ తుపాను తూర్పు కోస్తాకు సమీపించినట్లు తెలిపింది. గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ తుపాను మంగళవారం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం నౌకాశ్రయం (Port)లో కార్యకలాపాలను నిలిపేశారు.  Visakhapatnam అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం నుంచి 23 విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు. 



అసని తుపాను (Cyclone Asani) ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ తుపాను తూర్పు కోస్తాకు సమీపించినట్లు తెలిపింది. గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ తుపాను మంగళవారం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నౌకాశ్రయం (Port)లో కార్యకలాపాలను నిలిపేశారు.  Visakhapatnam అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం నుంచి 23 విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు. 


IMD (వాతావరణ శాఖ) తాజాగా ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మే 10 మంగళవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అసని తుపాను కారణంగా బంగాళాఖాతంపై తూర్పు గాలుల వల్ల ఉత్తర భారత దేశంలో అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తల్లో పెరుగుదల పెద్దగా కనిపించలేదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. అయితే తేమ స్థాయి పెరగడంతో అసౌకర్యంగా ఉంటుందని తెలిపింది. IMD వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం తీరాలకు అసని తీవ్ర తుపాను మే 11 ఉదయానికి చేరుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి సాగుతూ తుపానుగా బలహీనపడుతుంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!