మీకు చేతగాకపోతే.. మహిళలకు గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2022-05-14T08:54:22+05:30 IST

మీకు చేతగాకపోతే.. మహిళలకు గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి

మీకు చేతగాకపోతే.. మహిళలకు గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి

టీడీపీ మహిళా నేతలు

‘ఊరికో ఉన్మాది’ పుస్తకం 2వ భాగం విడుదల 

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘‘నెల రోజుల్లో రాష్ట్రంలో 60కి పైగా అత్యాచార ఘటనలు జరిగాయి. ఎన్ని జరిగినా ఈ ప్రభుత్వంలో కనీస చలనం లేదు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలకు రక్షణ కల్పించడం చేతగాకపోతే వారికి గన్‌ లైసెన్సులు అయినా ఇవ్వాలి’’ అని టీడీపీ మహిళా నేతలు డిమాండ్‌ చేశా రు. మహిళలు ఎవరికి వారు కారం పొట్లాలు, పెప్పర్‌ స్ర్పేలు పట్టుకొని తిరగాల్సిన రోజులు వచ్చాయని ధ్వజమెత్తారు. ‘ఊరి కో ఉన్మాది’ పేరుతో గతంలో విడుదల చేసిన పుస్తకానికి కొనసాగింపుగా ఇటీవలి కా లంలో చోటు చేసుకొన్న ఘటనలతో రెండో భాగాన్ని వారు శుక్రవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, అంగన్‌వాడీ కార్మికుల రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు ఆచంట సునీత, పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నాబత్తుని జయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలను కాపాడలేని సీఎం జగన్‌రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా  చేయాలని ప్రతిభా భారతి డిమాండ్‌ చేశారు. ‘‘అత్యాచారాలు, అఘాయిత్యాలపై రోజూ మాట్లాడాల్సి వస్తున్నందుకు మేం సిగ్గుపడాల్సి వస్తోంది. పుస్తకం తీసుకువెళ్లి మహిళా కమిషన్‌ చైర్మన్‌కు ఇచ్చాం. ఆ తర్వాతైనా ప్రభుత్వంలో కదలిక ఉంటుందని అనుకొన్నాం. కాని లేదు’’ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. 

Read more