అక్షయ తృతీయ కారణంగా భారీగా బంగారం కొనుగోళ్ళు

ABN , First Publish Date - 2022-05-03T17:07:11+05:30 IST

అక్షయ తృతీయ సందర్భంగా భారీగా బంగారం కొనుగోళ్ళు జరుగుతున్నాయి. కరోనా తరువాత షాపింగ్ స్వేఛ్ఛతో కొనుగోళ్ళు ఊపందుకున్నాయి.

అక్షయ తృతీయ కారణంగా భారీగా బంగారం కొనుగోళ్ళు

విజయవాడ: అక్షయ తృతీయ సందర్భంగా భారీగా బంగారం కొనుగోళ్ళు జరుగుతున్నాయి.  కరోనా తరువాత షాపింగ్ స్వేఛ్ఛతో  కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. దీంతో ఈ సెంటిమెంట్‌ను  బంగారం దుకాణాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కాగా... అక్షయతృతీయ రోజూ బంగారం దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. తూకంలో మోసాలు అన్న సమాచారంతో తూనికలు కొలతల అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో వన్ఎంజీ తూకంపై అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. రాయి ఉన్న బంగారం విషయంలో తస్మాత్ జాగ్రత్త అని అధికారులు చెబుతున్నారు. తూనికలు కొలతల సర్టిఫికేట్ లేకపోతే నేరమే అని అధికారులు తెలిపారు. 

Read more