బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తాం: Sajjala

ABN , First Publish Date - 2022-05-11T22:31:25+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణకు ..

బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తాం: Sajjala

అమరావతి:  ఏపీ మాజీ మంత్రి, TDP సీనియర్ నాయకుడు Narayanaకు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని AP ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత కోసం ఓ వ్యవస్థ మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ పిల్లల జీవితాలలో ఆడుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఓ విప్లవకారుడిని అరెస్టు చేసినట్లు హడావిడి చేస్తున్నారని.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టాలా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్నందువల్లే నారాయణను పోలీసులు అరెస్టు చేశామని, రాజకీయ ముసుగులో ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామన్నారు. 


Read more