రెవెన్యూ డివిజన్‌గా.. రేపల్లె
ABN, First Publish Date - 2022-05-14T05:31:18+05:30
తీర ప్రాంతంలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలను కలిపి రేపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గురువారం జరిగిన సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వర్గం తీర్మానాన్ని ఆమోదించింది.
తీర్మానం ఆమోదించిన మంత్రివర్గం
రేపల్లె, మే 13: తీర ప్రాంతంలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలను కలిపి రేపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గురువారం జరిగిన సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వర్గం తీర్మానాన్ని ఆమోదించింది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలు, వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాలను కలుపుతూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను రూపొందించారు. ఈ క్రమంలో పరిపాలనా సౌలభ్యం కోసం రేపల్లె డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రేపల్లె డివిజన్‌తో బాపట్ల, చీరాలతో పాటు జిల్లాలో మూడో డివిజన్ అవుతుంది. డివిజన్ ఏర్పాటుపై తీర ప్రాంతంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే రేపల్లెను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని టీడీపీ, బీజేపీతో పాటు వివిధ పక్షాల నాయకులు, పలు ప్రజా సంఘాలు కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి 4.20 లక్షల జనాభా ఉన్నారు. అయితే చుండూరు, వేమూరు మండలవాసులు రేపల్లె సబ్ డివిజన్‌కు రావాలంటే కొంతమేర దూరం ఎక్కువ. డివిజన్ ఏర్పాటుతో వివిధ శాఖల కార్యాలయాలు రేపల్లెలో ఏర్పాటు కానున్నాయి.