ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పెన్షనర్లు పాట్లు

ABN, First Publish Date - 2022-05-14T05:33:30+05:30

వారంతా విశ్రాంత ఉద్యోగులు.. ఏ నెలకానెల వచ్చే పెన్షనే వారికి ఆధారం. తిండికి, మందులకు అవసరమైన నగదు కోసం ప్రతి నెల ఒకటో తేదీ నుంచే ఎదురుచూస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

లైఫ్‌ సర్టిఫికెట్లపై తకరారు

ఆన్‌లైన్‌ చేసినా ఇవ్వలేదని ఖజానా మెమో 

గడువు దాటిన రెండు నెలల తర్వాత  మడతపేచీ

13 రోజులైనా జీతాల రాక పెన్షనర్ల లబోదిబో

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో  6,700 మందికి పెండింగ్‌

బతికేఉన్నాం పెన్షన్లు ఇవ్వండని విశ్రాంత ఉద్యోగుల వేడుకోలు


 

తెనాలి, మే 13 (ఆంధ్రజ్యోతి): వారంతా విశ్రాంత ఉద్యోగులు.. ఏ నెలకానెల  వచ్చే పెన్షనే వారికి ఆధారం. తిండికి, మందులకు అవసరమైన నగదు కోసం ప్రతి నెల ఒకటో తేదీ నుంచే ఎదురుచూస్తుంటారు. అయితే మే నెల 13 రోజులైనా పెన్షన్ల కోసం విశ్రాంత ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. భర్త చనిపోయి, కుటుంబ పెన్షన్‌పై ఆధారపడిన వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సుమారు 6,700 మందికి పెన్షన్లు పడలేదు. ఎదురుచూసి చూసి విసిగిన పెన్షనర్లు ఆరా తీస్తే మీరు బతికున్నట్లు సర్టిఫికెట్‌ ఇవ్వలేదని, వెంటనే అందించాలని ఖజానా శాఖ నుంచి సమాచారం రావటంతో అవాక్కవుతున్నారు. గడువులోపే ఆన్‌లైన్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించినా ఇదేం తంతంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అదికూడా గడువు దాటిపోయిన రెండు నెలల తర్వాత ఇవ్వలేదనడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.  సాధారణంగా ప్రతి విశ్రాంత ఉద్యోగి ఏ ఏడాదికి ఆఏడాది బతికే ఉన్నట్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో కానీ, మ్యాన్యువల్‌గా కానీ అందించాలి. అయితే ఈ సంవత్సరానికి ఆయా సర్టిఫికెట్‌లు అందించడానికి ఫిబ్రవరి 28 వరకు ఖజానా శాఖ గడువు ఇచ్చింది. ఆ తేదీలోపు లైఫ్‌ సర్టిఫికెట్‌ అందిస్తేనే మరుసటి నెల నుంచి పెన్షన్‌ బ్యాంకు ఖాతాలో పడుతుంది. లేదంటే  ఆపేస్తారు. అయితే ఇక్కడ విచిత్రమేమంటే ఫిబ్రవరిలో సర్టిఫికెట్‌ ఇవ్వకుంటే మార్చి 1న పడాల్సిన పెన్షన్‌ ఆగిపోవాలి. కానీ ఆ నెలతోపాటు, మార్చి వరకు పెన్షన్‌ను పెన్షనర్ల ఖాతాల్లో వేశారు.  రెండు నెలల తర్వాత వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉన్నట్టు రావడంపై పెన్షనర్లు, వారి సంఘాలు మండిపడుతున్నాయి.


తీరిగ్గా మెమో జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో ఇంకా 38,038 మంది లైఫ్‌ సర్టిఫికెట్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే సమర్పించేలా వారికి సబ్‌ ట్రెజరీ అధికారులు సమాచారం అందించాలని  తాజాగా ట్రెజరీ అండ్‌ ఎకౌంట్స్‌ డైరెక్టర్‌ పేరుతో మెమో డీ 4-14035-2021ను జారీ చేశారు. మే 4 తేదీతో ఈ మెమో జారీకాగా అది తీరిగ్గా 12న పెన్షనర్లకు అందింది. అయితే తాము ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పిస్తే సక్సెస్‌ అని కూడా వచ్చిందని   ఇప్పుడు ఈ తకరారు ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు దాటిన తర్వాత రెండు నెలలు పెన్షన్‌ అందుకున్నామని, ఇప్పుడు ఆ సర్టిఫికెట్‌ ఇవ్వలేదని మే పెన్షన్‌ ఆపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జనవరిలో ఇచ్చినా ఇంకా పెండింగ్‌ చూపుతున్నారని వాపోయారు.  ప్రభుత్వం ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28 అయితే, ఈ లోపు అందించిన వారి ఖాతాలకే ఫిబ్రవరి పెన్షన్‌ చేరుతుంది. ఒకవేళ ఆ నెలకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పెండింగ్‌ ఉందనుకుంటే, వారిని ఇబ్బందిపెట్టకూడాదనే ఉద్దేశంతో ఆ నెల పెన్షన్‌ వేసినా, తర్వాత నెల మార్చికి సంబందించిన పెన్షన్‌ను నిలిపివేయాలి. కానీ వీరికి ఫిబ్రవరి నెల పెన్షన్‌ మార్చిలో, మార్చి నెల పెన్షన్‌ ఏప్రిల్‌లో వేసేశారు. ఏప్రిల్‌ నెల పెన్షన్‌ వేసే సమయం వచ్చేసరికి మేలో వారి లైఫ్‌ సర్టిఫికెట్ల పరిశీలన ఏమిటనేది సంఘాల వాదన. ఒకవేళ వీరి లైఫ్‌ సర్టిఫికెట్‌లు అందకుంటే, ఏప్రిల్‌ నెలాఖరులోపే తెలియజేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.


ఆన్‌లైన్‌ పత్రాన్ని ఆమోదించడంలేదు

తాము ఆన్‌లైన్‌లో పోస్టాఫీస్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించామని, సక్సెస్‌ అయినట్టు వచ్చిన ధృవీకరణ పత్రాన్ని ట్రెజరీకు తీసుకెళ్లి ఇచ్చినా చెల్లదంటున్నారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకట్రావు అనే పెన్షనర్‌, బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన నాంచారమ్మ అనే కుటుంబ పెన్షనర్లు వాపోయారు.  మ్యాన్యువల్‌ పద్ధతిలో అందించాల్సిందేనని తిప్పి పంపుతున్నారన్నారు. మళ్లీ ఆ పత్రాలు పూర్తి చేసి, గజిటెడ్‌ అధికారి సంతకం చేయించి ఇవ్వాలంటే ఎంత ఇబ్బందో అర్థం కూడా చేసుకోవడంలేదని  వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగుల తీరుపై ఓ పెన్షనర్‌ అయితే తెనాలి ఖజాన కార్యాలయం దగ్గర కన్నీటిపర్యంతమయ్యారు. ఖజానా శాఖ దీనిపై పునరాలోచించాలని పెన్షనర్ల సంఘాలు వేడుకుంటుంటే ఈ నెల పెన్షన్‌ విషయంలో వారు ఏంచేస్తారో చూడాల్సిందే. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!