-
-
Home » Andhra Pradesh » Guntur » kanna lakshminarayana comments-MRGS-AndhraPradesh
-
APలో మతమార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయి: Kanna
ABN , First Publish Date - 2022-05-11T21:24:25+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు...

Amaravathi: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మతమార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయని, హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ చేశారని, ఆత్మకూరులో హిందువుల ప్రాంతంలో మసీదు ఎందుకు కడుతున్నారని అడిగితే తమ జిల్లా ప్రెసిడెంట్‌పై దాడి చేశారన్నారు. తెనాలిలో హిందూ మహిళని వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. శ్రీశైలంలో అన్యమత మతస్థులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాకినాడ జేఎన్టీయులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.