-
-
Home » Andhra Pradesh » Guntur » former minister prathipati pullarao guntur andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ABN , First Publish Date - 2022-05-14T17:01:07+05:30 IST
మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.
గుంటూరు: మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. చిలకలూరిపేట మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పధకం ప్రారంభ సమయంలో జరిగిన గొడవలో టీడీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ను కులం పేరుతో దూషించారని మున్సిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5గా రాష్ట్ర టీడీపీ నాయకులు కరీముల్లాలపై కేసులు నమోదు అయ్యాయి.