ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌, సీఈవోలను తొలగించాలి

ABN, First Publish Date - 2022-05-14T05:43:31+05:30

జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కోరారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగం డెయిరీ ఛైర్మన్‌ నరేంద్ర

గుంటూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశమై బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు. రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము స్వాహా అయిన దృష్ట్యా సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలన్నారు. వైసీపీ ముఖ్యనేత బంధువైన కారుమూరి అశోక్‌రెడ్డి, మాచవరం తహసీల్దార్‌ హన్మంతరావు పలు అక్రమాల్లో ముఖ్యపాత్రదారులుగా ఉన్నారని ఆరోపించారు. వీరిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని బ్యాంకు బ్రాంచీలు, సంఘాలలో మాత్రమే బోగస్‌ రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలా కాకుండా 167 సంఘాలన్నింటిని విచారణ జరిపితే అసలు ఎంత సొమ్ము దుర్వినియోగమైంది, దోషులు ఎవరు అనే విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. బ్యాంకుకు చెందిన 42 బ్రాంచీలలోనూ తనిఖీలు నిర్వహించాలన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు వైసీపీ వచ్చిన తర్వాత దాని ప్రతిష్ట స్కామ్‌ల ద్వారా మసకబారుతోండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఈ రెండేళ్లలో ఇచ్చిన రూ.850 కోట్ల రుణాల్లో అనేక అక్రమాలువెలుగు చూస్తున్నాయన్నారు. బినామి గ్రూపుల పేరుతో రూ.లక్షలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, పొన్నూరు, దుర్గి, మంచికల్లు, కరాలపాడు, సిరిగిరిపాడు బ్రాంచ్‌లలో రుణాల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఈ మేరకు ఛైర్మన్‌ నరేంద్ర కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు.   


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!