అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-14T05:44:55+05:30 IST

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌లో ఏపీపీఎస్సీ ఈనెల 14, 15 తేదీలలో నిర్వహించే అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో చంద్రశేఖరరావు అదేశించారు.

అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాతున్న డీఆర్వో చంద్రశేఖరరావు, ఇతర అధికారులు

గుంటూరు(తూర్పు), మే13: ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌లో ఏపీపీఎస్సీ ఈనెల 14, 15 తేదీలలో నిర్వహించే అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో చంద్రశేఖరరావు అదేశించారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం ఏపీపీఎస్సీ ప్రత్యేక అధికారి మాధవీలతతో కలసి పరీక్ష ఏర్పాట్లపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఈనెల 14న ఐదు పరీక్షా కేంద్రాల్లో 1251 మంది, 15వ తేదీన 18పరీక్ష కేంద్రాల్లో 4404 మంది, మధ్యాహ్నం 4382 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్ధులు 15నిముషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్షా సమయంకు ఒక్క నిముషం తరువాత కూడా అనుమతించే ప్రశక్తిలేదని స్పష్టం చేశారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే అధనపు సమయం కేటాయించబడుతుందని తెలిపారు. దివ్యాంగులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పరీక్ష రాయడానికి వీలుగా ఏర్పాటు చేయాలని వారికి అధనంగా గంటకు 20నిముషాలు చొప్పున 50నిముషాలు కేటాయించాలన్నారు. వైద్య సిబ్బంది మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్దంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు డీటీ ఎల్‌ జానకీదేవి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

   

Read more