ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే.. గడప గడపకు

ABN, First Publish Date - 2022-05-14T05:46:17+05:30

గత మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సచివాలయాల వ్యవస్థ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సచివాలయాల వ్యవస్థ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మండలస్థాయి అధికారులు, ప్రత్యేకాధికారుల బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. అర్హత ఉండి సాంకేతిక కారణాల వలన సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారి వివరాలను ప్రత్యేక నివేదిక రూపంలో అందించాలని సూచించారు. అన్ని పథకాల లబ్ధిదారుల జాబితాలు నోటీసు బోర్డుల్లో ఉండేలా చూడాలన్నారు. జగనన్న పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్లలో గత వారంతో పోల్చితే కొద్దిగా పురోగతి ఉందని, మరింత పెంచాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలకు ప్రాథమికంగా అవసరమైన నగదు కోసం డ్వాక్రా సంఘం సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా సిమెంట్‌, ఇనుము, ఇసుక అవసరం మేరకు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్‌కు దరఖాస్తు చేసుకొన్న వారందరికి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు వీలు కాని దరఖాస్తుల వివరాలను రెవెన్యూ అధికారులకు అందించాలన్నారు. ఉపాధి హామి పథకం సంబంధించి కూలీల డిమాండ్‌, రిపోర్టింగ్‌, బిల్లుల జనరేషన్‌ సంఖ్యలకు భారీగా వ్యత్యాసం ఉంటోందని, ఆ వివరాలను సక్రమంగా నివేదించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో కేశవరెడ్డి, హౌసింగ్‌ పీడీ సాయినాథ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి గీత రాణి, ఆర్‌ డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యన్నారాయణ రాజు, గుంటూరు ఆర్‌డీవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.  


 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!