ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Elections ఎప్పుడొచ్చినా సిద్ధం: పవన్ కల్యాణ్‌

ABN, First Publish Date - 2022-05-09T01:54:44+05:30

ఎన్నికలు (Election) ఎప్పుడొచ్చినా సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan‌) స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కర్నూలు: ఎన్నికలు (Election) ఎప్పుడొచ్చినా సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan‌) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ వస్తే.. ఏపీ భవిష్యత్ ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. విభజనతో ఏపీకి జరిగిన అన్యాయంపై బీజేపీతో పలుమార్లు మాట్లాడానని తెలిపారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని హెచ్చరించారు. ఏపీలో పట్ట పగలే ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించకుండా.. తల్లి పెంపకంపై నెపం నెట్టడం దుర్మార్గమన్నారు. 


‘‘151 మంది ఎమ్మెల్యేలున్నారని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారు. భవిష్యత్‌లో వైసీపీ (YCP)కి 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను. నన్ను ఆర్థికంగా దెబ్బతీసినా లెక్క చేయను. వ్యక్తిగత దాడులు చేసినా భరించేందుకు నేను సిద్ధం. నాకు భయం లేదు.. వైసీపీ నేతలు అది తెలుసుకోవాలి. రాజకీయాల్లో పౌరుషాలుండవు.. వ్యూహాలే ఉంటాయి. మేం సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరెవరు?.. ప్రజల కన్నీరు తుడవలేని అధికారం మీకెందుకు?’’ అని పవన్ ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!