గోదావరి లంక అవినీతి ఆరోపణపై చర్చకు రండి

ABN , First Publish Date - 2022-05-14T06:12:35+05:30 IST

గొంగూరగడ్డ లంకలో అవినీతి నిరూపణకు బహిరంగ చర్చకు రావాలని కొవ్వూరు ఎంపీపీ కాకర్ల నారాయుడు టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

గోదావరి లంక అవినీతి ఆరోపణపై చర్చకు రండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నారాయుడు తదితరులు

మాజీ మంత్రి జవహర్‌కు వైసీపీ నాయకుల సవాల్‌


కొవ్వూరు, మే 13 : గొంగూరగడ్డ లంకలో అవినీతి నిరూపణకు బహిరంగ చర్చకు రావాలని కొవ్వూరు ఎంపీపీ కాకర్ల నారాయుడు టీడీపీ  నాయకులకు సవాల్‌ విసిరారు. కొవ్వూరు హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైసీపీ నాయకులు మాజీ మంత్రి జవహర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ముదునూరి నాగరాజు మాట్లాడుతూ హోంమంత్రి, ఎంపీపీ కాకర్ల నారాయుడు కోట్లాది రూపాయలు అవినీతి చేశారని అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ఫీల్డ్‌ లేబర్‌ వెల్ఫేర్‌ కోఆపరేటివ్‌ సొసైటీని నిర్వీర్యం చేయడానికి బూరుగుపల్లి వీరరాఘవులు పూనుకున్నారని సొసైటీ అధ్యక్షుడు పసలపూడి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడపల్లిలో 1923 నుంచి ఫీల్డ్‌ లేబర్‌ వెల్ఫేర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో లంక భూములను సాగు చేసుకుంటున్నామన్నారు.ఇటీవల సొసైటీ సభ్యుల తీర్మానం మేరకు భూమిని సాగుకు అనుగుణంగా శుభ్రం చేస్తుండగా బూరుగుపల్లి వీరరాఘవులు యంత్రాలను తెచ్చి ఇబ్బందు లకు గురిచేస్తున్నారన్నారు. కోట్ల రూపాయలు అవినీతి జరిగితే సొసైటీ సభ్యుల వద్దకు బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్‌ బండి పట్టాభిరామారావు, ముళ్లపూడి కాశీ, సుంకర సత్యనారాయణ, వరిగేటి సుధాకర్‌, ఉప్పులూరి సూరిబాబు, సర్పంచ్‌ మట్టా శ్రీనివాస్‌, సొసైటీ సభ్యులు గెల్లా నాగేశ్వరరావు, వాడపల్లి సర్పంచ్‌ గెల్లా ప్రసాద్‌, ముప్పిడి వెంకట్రావు,జార్జి పాల్గొన్నారు.


Read more