-
-
Home » Andhra Pradesh » East Godavari » today apeap cet special veb counciling
-
నేటి నుంచి ఏపీఈఏపీసెట్ ప్రత్యేక వెబ్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2022-11-07T00:38:11+05:30 IST
ఏపీఈఏపీసెట్-2022 అడ్మిషన్లకు ఎంపీసీ విభాగం అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రత్యేక రౌండ్ వెబ్‌కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది.
నేడు,రేపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
జేఎన్టీయూకే, నవంబరు 6: ఏపీఈఏపీసెట్-2022 అడ్మిషన్లకు ఎంపీసీ విభాగం అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రత్యేక రౌండ్ వెబ్‌కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో మొదటి, తుది దశ వెబ్‌కౌన్సెలింగ్‌లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి నోటిఫికేషన్‌ను ఏపీఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ఆదివారం జారీచేశారు. ఈనెల 7,8 తేదీల్లో విద్యార్థికి ఏ ర్యాంకు వచ్చినా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుచేసుకోవచ్చని కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్(ఏపీటీ) కళాశాల సహాయకేంద్రం సమన్వయకర్త, ప్రిన్సిపాల్ ఎన్.జనార్ధనరావు తెలిపారు. ఏపీఈఏపీసెట్ మొదటిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమై సెప్టెంబరు చివరివారం ముగిసింది. అదే నెలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సంబందిత ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులను ప్రారంభించారు. తుది దశ వెబ్ కౌన్సెలింగ్‌ను అక్టోబరులో నిర్వహించగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సంబందిత ఇంజనీరింగ్‌కళాశాలల్లో తరగతులు అక్టోబరు 31న ప్రారంభమయ్యాయి.
ఫ ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 28 ప్రైవేట్, 2 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 11,500 సీట్లుండగా, ఏపీఈఏపీసెట్‌లో ఇంజనీరింగ్‌కు 12,465 మంది, ఫార్మసీకి 4943 మంది అర్హత సాధించారు. జిల్లాలో మొదటి, తుది దశ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో సుమారు 70 శాతం సీట్లు భర్తీఅయినట్లు సమాచారం.
ఫఅభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కాకినాడలోని జగన్నాధపురం ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన సహాయకేంద్రంలో సంప్రదించాలి. సందేహాల నివృత్తికై 9912342010, 9440372084కు ఫోన్ చేయవచ్చని సహాయకేంద్రం సమన్వయకర్త ఎన్.జనార్ధనరావు సూచించారు.
ఫ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ : ఈనెల 7,8 తేదీలలో
ఫధ్రువపత్రాల పరిశీలన : ఈనెల 8,9 తేదీలలో
ఫవెబ్ ఆప్షన్ల నమోదు :ఈనెల 7నుంచి 9వరకూ
ఫఆప్షన్ల మార్పు : ఈనెల 9
ఫ సీట్ల కేటాయింపు : నవంబరు 11.
ఫ కళాశాలల్లో రిపోర్టింగ్ : ఈనెల 11నుంచి 14 వరకూ
ఫ విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సినవి : ర్యాంకు కార్డు, మార్కుల జాబితా, హాల్‌టికెట్, పుట్టినరోజు, టీసీ, స్టడీ ధ్రువపత్రం, ఈడబ్ల్యూఎస్, నివాస, కులధ్రువీకరణ, ఆదాయ, స్థానికత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి.
Read more

