ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

శెట్టిబిలిజ సంఘం నేత ‘కుడుపూడి’ గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2022-05-14T06:12:04+05:30

మురమళ్లలో ముఖ్యమంత్రి జగన పర్యటనలో భాగంగా ఉభయ తెలుగు రాషా్ట్రల శెట్టిబలిజ సంఘం కన్వీనర్‌, వైసీపీ సీనియర్‌ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణరావును శుక్రవారం గృహ నిర్బంధం చేశారు. పట్టణంలోని సూర్యనగర్‌లో గల ఆయన స్వగృహం వద్దకు తాలూకా సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని నిర్బంధించారు.

సూర్యనారాయణరావుకు సంఘీభావం తెలుపుతున్న శెట్టిబలిజ కులస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని మంత్రివర్గం నుంచి తక్షణం బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌

అమలాపురం టౌన, మే 13: మురమళ్లలో ముఖ్యమంత్రి జగన పర్యటనలో భాగంగా ఉభయ తెలుగు రాషా్ట్రల శెట్టిబలిజ సంఘం కన్వీనర్‌, వైసీపీ సీనియర్‌ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణరావును శుక్రవారం గృహ నిర్బంధం చేశారు. పట్టణంలోని సూర్యనగర్‌లో గల ఆయన స్వగృహం వద్దకు తాలూకా సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న శెట్టిబలిజ సంఘీయులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రివర్గం నుంచి తక్షణం బర్తరఫ్‌ చేయాలని కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండు చేశారు. నీచ సంస్కృతి కలిగిన వేణును రాష్ట్ర కేబినేట్‌లో ఉంచుకోవడం ధర్మం కాదని ముఖ్యమంత్రి జగనకు హితవు పలికారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శెట్టిబలిజలకు ప్రత్యేకంగా కార్పొరేషన ఏర్పాటుచేసి రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగనకు గుర్తు చేయడంతో పాటు పలు సమస్యలను వైసీపీ నాయకుడిగా ఆయన దృష్టికి తీసుకువెళదామనుకున్నామని వివరించారు. మంత్రి వేణును బర్తరఫ్‌ చేయకుంటే 2024 ఎన్నికల్లో శెట్టిబలిజ సంఘీయులు కీలక నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. మా ఓటు బ్యాంకు కాపాడుకుంటారో, వదులుకుంటారో నిర్ణయం మీదేనని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో వేణు వ్యవహరించిన తీరుపై మంత్రుల బృందం పర్యటనలో భాగంగా  సంఘీయులు నిరసన వ్యక్తం చేశారన్నారు. దానిని ఆసరాగా తీసుకుని పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ను వీఆర్‌లోకి పంపడం దారుణమన్నారు.   సీఐ బాజీలాల్‌ను వీఆర్‌ నుంచి వెంటనే తప్పించి విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ఆయనకు మద్దతుగా శెట్టిబలిజ సంఘీయులంతా శనివారం అమలాపురం హైస్కూలు సెంటర్‌లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతారని  కుడుపూడి పేర్కొన్నారు. కుడుపూడి వెంట కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సుభాష్‌, దొంగ శ్రీను తదితరులు ఉన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!