ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ధరలపై పోరాటాన్ని అరెస్టులతో ఆపలేరు!

ABN, First Publish Date - 2022-05-14T07:00:13+05:30

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య విమర్శించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రావుల వెంకయ్య, పక్కన సీపీఐ మధు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రాష్ట్రంలో అరాచక పాలన 

 ధరల పెరుగుదలపై ఉద్యమిస్తాం

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య 

‘గడపగడప’కు వస్తున్న వైసీపీ నేతలను నిలదీయండి : మధు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 13: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య విమర్శించారు. ధరల పెరుగుదలపై ఆందోళనబాట పట్టిన తమపై నిర్బంధాలు, అరెస్టులకు ప్రభుత్వం పాల్పడిందని, అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ వంటి ధరలన్నీ పెరిగాయని, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయన్నారు. తుఫాన్‌ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అరటి, మామిడి వంటి పంటలకు నష్టం జరిగిందని, ప్రభుత్వం తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఆహార పంటలకు రూ.25 వేలు చెల్లించాలన్నారు. తుఫాన్‌ బాధిత కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం అందజేయాలని కోరారు.  రాజద్రోహం చట్టంపై సుప్రీంస్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని వెంకయ్య అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజాస్వామికవాదులు వంటి వారిపై పాలకులు దేశద్రోహం కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. వచ్చే ఎన్నికల్లో భావసారూప్య పార్టీలతో పొత్తులు ఉంటాయని, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని, ఆ దిశగా తమ పార్టీ అధినాయకత్వం పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ఇళ్లకు వస్తున్న వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని, ధరల పెరుగుదలపై ప్రశ్నించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి నల్లా రామారావు, జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాంబాబు, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు వి.కొండలరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కొండేపూడి జ్యోతిరాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!