గడపగడపలో సమస్యల సెగ
ABN, First Publish Date - 2022-05-14T06:07:53+05:30
మూడో రోజూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు సమస్యల సెగ తగిలింది.
మూడో రోజు ఎమ్మెల్యే తలారికి నిరసన గళం
గోపాలపురం, మే 13 : మూడో రోజూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు సమస్యల సెగ తగిలింది. మండలంలోని దొండపూడి గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం మూడో రోజైన శుక్రవారం కొనసాగింది. కరెంటు కోతలు, విద్యుత్ ధరలు, గ్యాస్ నిత్యావసరాల ధరలతో పాటు గత కొన్నేళ్లగా ఆర్‌అండ్‌బీ స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యేను మహిళలు వేడుకున్నారు. అడుగడుగనా సమస్యలు వెల్లువెత్తడంతో ప్రజలను సముదాయిస్తూ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని సర్దుకుపోదాం అంటూ ఎమ్మెల్యే తలారి సమా ధానం ఇచ్చారు.గత మూడు రోజులుగా జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య నాయకులు ముందుకు రాకపోవడంతో మండల స్థాయి అధికారులతో పాటు సచివా లయ సిబ్బంది వలంటీర్లతోనే సరిపెట్టుకుని ముందుకు సాగుతున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ,ఇళ్ళ భాస్కరరావు, సర్పంచ్‌లు అచ్చిబాబు,అన్సర్‌భాష, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్‌కే వల్లి, ముల్లంగి శ్రీనివాస్‌రెడ్డి పాల్గ్గొన్నారు.