-
-
Home » Andhra Pradesh » East Godavari » problems solutions strick-NGTS-AndhraPradesh
-
అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ధర్నా
ABN , First Publish Date - 2022-05-14T06:24:02+05:30 IST
అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండుచేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నిమ్మ కాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు.
అమలాపురంటౌన్, మే 13: అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండుచేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నిమ్మ కాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ ఆరు నెలలుగా పారిశుధ్య కార్మికులకు హెల్త్ ఎలవెన్స్ చెల్లించలేదని, వెంటనే నిధులు విడుదలచేయాలని డిమాండు చేశారు. పారిశుధ్య కార్మికులను సచివాలయ సిబ్బందితో జతచేయడాన్ని యూ నియన్ వ్యతిరేకిస్తుందన్నారు. ధర్నాలో యూనియన్ ప్రతినిధులు రాయుడు సుబ్బ లక్ష్మి, మీసాల మంగాయమ్మ, భవిరిశెట్టి భవాని, చిల్లే పాపాయమ్మ, వీరమ్మ, పళ్లాలమ్మ, మల్లారపు రాజు, పులపకూర రవికుమార్, పోతుల రాజేష్ పాల్గొన్నారు.
జీతాల కోసం నిరసన
అమలాపురం రూరల్: ఈదరపల్లిలోని ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ నెలలో పదమూడు రోజులు గడిచిపోయినా ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడాన్ని వారు నిరసించారు. ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ డివిజన్ చైర్మన్ ఎంవీ రమణ డిమాండు చేశారు. నిరసనలో ఏపీ ట్రాన్స్‌కో జేఏసీ చైర్మన్ జగతా అచ్యుతరామయ్య, డీఈఈ రాజ్‌కుమార్, ఏఈ రమణి, ఎస్సీ అసోసియేషన్ కార్యదర్శి అంబటి రాజారత్నం, యూనియన్ నాయకులు బొంతు శ్రీసత్యసాయి, బీఎస్‌ఎస్ శెట్టి పాల్గొన్నారు.

