ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వసతులు ఫుల్‌... వైద్యులు నిల్‌!

ABN, First Publish Date - 2022-05-14T06:14:35+05:30

కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గం వైవిధ్యంగా ఉంటుంది. గోదావరి తీరంలో లంక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. లంక గ్రామం నుంచి నియోజకవర్గ, మండల కేంద్రాలకు వెళ్లాలంటే సుమారు గంటసమయం పడతుంది. దీంతో వారికి ఇక్కడి ప్రజలకు పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేందమే అన్ని విధాల అందుబాటులో ఉంటుంది.

సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా వున్న పడకలు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • అబ్దుల్‌ కలాం ట్రస్టు, ప్రభుత్వ సహకారంతో ఆసుపత్రి అభివృద్ధి
  • నాడు నెలకు 60 అపరేషన్లు... నేడు సాధారణ ప్రసవాలకే పరిమితం
  • 50 పడకల ఆసుపత్రికి ముగ్గురే వైద్యులు
  • ఇదీ పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి

పి.గన్నవరం, మే 13: కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గం వైవిధ్యంగా ఉంటుంది. గోదావరి తీరంలో లంక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. లంక గ్రామం నుంచి నియోజకవర్గ, మండల కేంద్రాలకు వెళ్లాలంటే సుమారు గంటసమయం పడతుంది. దీంతో వారికి ఇక్కడి ప్రజలకు పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేందమే అన్ని విధాల అందుబాటులో ఉంటుంది. సాధారంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు నామమాత్రంగా ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా పి.గన్నవరంలో అబ్దుల్‌ కలాం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో కార్పొరేట్‌ ఆసుపత్రికి  దీటుగా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విశాలమైన వార్డులు, ఏసీ గదులు ఉన్నాయి. ఇటివలే ప్రభుత్వం డిప్యూటేషన్లు రద్దు చెయడంతో ప్రస్తుతం ఉన్న మత్తు డాక్టర్‌  (ఆసుపత్రి సూపరింటెండెంట్‌), వారానికి మూడు రోజులు వచ్చే గైనకాలజిస్ట్‌ యఽథాస్థానా ల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆపరేషన్లు చేసే వైద్యులు లేకపోవడంతో గర్భిణులు అమలాపురం, రాజోలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు.    గతంలో ఈ ఆసుపత్రిలో నెలకు 60 నుంచి 70 మంది గర్భిణులకు ఆపరేషన్లు చేసేవారు. అంతే కాకుండా ఆసుపత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు అవార్డులకు ఎంపికై నగదు బహుమతులు కూడా అందుకుంది. నేడు వైద్యులు లేకపోవడంతో ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ ప్రసవాలు తప్ప ఆపరేషన్లు జరగట్లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక ఆరోగ్యకేంద్రంలో తొమ్మిది మంది వైద్యులు (ఆర్ధోపెడిక్‌, గైనకాలజిస్టులు-3,  జనరల్‌ మెడిసిన్‌, మత్తు వైద్యుడు, పిల్లల వైద్య నిపుణుడు, జనరల్‌ ఎంబీబీఎస్‌-2) ఉండాలి. వీరితో పాటు డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, కంటి వైద్య నిపుణుడు, దంత వైద్యుడు ఉండాలి. పోస్ట్‌మార్టం నిర్వహించే గది ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు (ఎంబీబీఎస్‌, మత్తు వైద్యుడు, జనరల్‌ మెడిసిన్‌) వైద్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఆసుపత్రికి సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ వైద్యులు లేకపోవడంతో పూర్వ వైభవం కోల్పోయింది. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో మరో 20 పడకలను సిద్ధం చేస్తున్నారు. నిరుపయోగంగా పక్కనే ఉన్న పి.గన్నవరం పీహెచసీని డీసీ హెచఎస్‌, డీఎంహెచలో పరిశీలించి సామాజిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అయితే ఆ దిశగా అడుగులు ముందుకు పడట్లేదు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!